Adireddy Wife Kavitha : బిగ్ బాస్ ఇంట్లో ఆదిరెడ్డి ఫ్యామిలీ.. ఫుల్ పాజిటివ్ ఇమేజ్.. రేవంత్ కన్నీరుమున్నీరు

Bigg Boss 6 Telugu 12th week బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం ఫ్యామిలీ టచ్ ఇవ్వబోతోంది. తాజాగా వదిలిన ప్రోమోతో ఆదిరెడ్డికి ఫుల్ పాజిటివ్ ఇమేజ్ వచ్చేట్టు కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 12:19 PM IST
  • పన్నెండో వారంలో ఫ్యామిలీ టచ్
  • ఇంట్లో అడుగు పెట్టిన ఆదిరెడ్డి ఫ్యామిలీ
  • కన్నీరుమున్నీరైన సింగర్ రేవంత్
Adireddy Wife Kavitha : బిగ్ బాస్ ఇంట్లో ఆదిరెడ్డి ఫ్యామిలీ.. ఫుల్ పాజిటివ్ ఇమేజ్.. రేవంత్ కన్నీరుమున్నీరు

Adi reddy Family in Bigg Boss : బిగ్ బాస్ ఇంట్లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్లు రాబోతోన్నారు. ఈ పన్నెండో వారంలో ఫ్యామిలీ టచ్ ఇవ్వబోతోన్న బిగ్ బాస్ చాలా మంది కంటెస్టెంట్లకు ఫుల్ పాజిటివ్ ఇమేజ్ కట్టబెట్టేట్టున్నాడు. ఇందులో భాగంగా మొదట ఆదిరెడ్డి ఫ్యామిలీని బిగ్ బాస్ ఇంట్లోకి పంపించేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ప్రోమో ఫుల్ పాజిటివ్‌ అండ్ ఎమోషనల్ టచ్‌తో ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది.

ఆదిరెడ్డి తన భార్య, కూతురిని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఎలా ఆడుతున్నానో చెప్పు అని తన భార్య కవితను ఆదిరెడ్డి అడగటం, తన డ్యాన్స్ ఎలా ఉందని అడగటం, నవ్వుకుంటున్నానని చెప్పడంతో ఆదిరెడ్డి రియాక్షన్లు ఇలా అన్నీ కూడా ప్రోమోలో వైరల్ అయ్యాయి. ఇక ఆటలు ఆడేటప్పుడు కొట్టేసుకున్నా పర్లేదు అని కవిత అంటే.. నన్ను కూడా కొట్టమంటున్నావా? అని ఆదిరెడ్డి అంటాడు. హా..నువ్వేమైనా పెద్ద తోపా అంటూ ఆదిరెడ్డికే సెటైర్ వేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News