Bigg Boss 5 Telugu: షణ్మూకు రికార్డు నామినేషన్స్...ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ హౌస్ లో సోమవారం నామినేషన్ ప్రక్రియ కూల్ గా సాగింది. అనంతరం కిచెన్ వ్యవహారం కొందరి హౌస్ మేట్ల మధ్య గొడవలకు కారణమైంది. మరి నిన్నటి గేమ్ లో ఎవరెవరు నామినేట్ అయ్యారో? ఏమేం గొడవలు జరిగాయే తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2021, 11:53 AM IST
Bigg Boss 5 Telugu: షణ్మూకు రికార్డు నామినేషన్స్...ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ షో నాలుగు వారాలు పూర్తి చేసుకుని...ఐదో వారంలో ఆడుగుపెట్టింది. మెుదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడోవారం లహరి ఎలిమినేట్ కాగా రీసెంట్‌గా నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం హౌస్(Bigg Boss 5 Telugu)లో 15 మంది ఉన్నారు. తాజాగా ఐదో వారం ఎలిమినేషన్ కు సంబంధించి నామినేషన్ ప్రక్రియ నిన్న జరిగింది. 

నామినేషన్ ప్రక్రియ జరిగిందిలా..
అయితే ఈ సారి నామినేషన్(Nomination process) ప్రక్రియలో ఒకొక్కరు ఇద్దరినీ నామినేట్ చేయాలనీ చెప్పాడు బిగ్ బాస్. దాంతో జెస్సీ .. యాంకర్ రవి- లోబోలను నామినేట్ చేయగా.. సన్నీ.. షణ్ముఖ్- ప్రియలను, విశ్వ.. జెస్సీ- షణ్ముఖ్ జస్వంత్‌లను, కాజల్.. యాంకర్ రవి-సన్నీ, లోబో.. మానస్- షణ్ముఖ్  ,  ప్రియాంక.. హమీదా-లోబో నామినేట్ చేశారు. అలాగే.. సిరి.. యాంకర్ రవి- హమీదా, యాంకర్ రవి.. జెస్సీ-షణ్ముఖ్ జస్వంత్‌‌‌లను నామినేట్ చేశాడు. ఇక ఆనీ మాస్టర్.. యాంకర్ రవి- విశ్వ, షణ్ముఖ్ జస్వంత్.. విశ్వ- మానస్‌,  హమీదా.. ప్రియ- షణ్ముఖ్ జస్వంత్, శ్వేతా.. మానస్- కాజల్,  ప్రియ.. షణ్ముఖ్ జస్వంత్- సన్నీ, మానస్.. జెస్సీ, షణ్ముఖ్ జస్వంత్‌,  శ్రీరామ్.. జెస్సీ- షణ్ముఖ్ జస్వంత్‌లను నామినేట్ చేశారు.

Also Read: Aaradugula Bullet trailer: ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్

ఒక్కరూ తప్ప అందరూ షణ్మూకే..
ఈ నామినేషన్ ప్రక్రియలో మునుపెన్నడు లేనివిధంగా షణ్ముఖ్‌(Shanmukh Jaswanth)ను ఏకంగా ఎనిమిది మంది నామినేట్ చేశారు. సన్నీ, విశ్వ, లోబో, రవి, హమీదా, ప్రియ, మానస్, శ్రీరామ్ అందరు షణ్ముఖ్‌ను నామినేట్ చేయడంతో షణ్ముఖ్ కాస్త ఫీల్ అయ్యాడు. మరీ ముఖ్యంగా జెస్సీ తప్ప అందరు అబ్బాయిలు షణ్ముఖ్‌ను నామినేట్‌ చేయడం గమనార్హం. ఈ దెబ్బకు షాకైన షణ్ను(Shanmukh Jaswanth) ఈరోజు కోసమే ఇంతకాలం వెయిట్‌ చేశానన్నాడు. ఇప్పుడు చూస్తార్రా నా గేమ్‌ అంటూ ఒక్కసారిగా హైపర్‌ అయిపోయాడు. మొత్తంగా ఈ ఐదోవారంలో షణ్ముఖ్‌, రవి, హమీదా, లోబో, మానస్‌, సన్నీ, ప్రియ, విశ్వ, జెస్సీ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

ఫుడ్‌ విషయంలో గొడవ
సోమవారం కిచెన్‌ పనులకు సంబంధించి పంపకాల్లో బేధాభిప్రాయాలు రావడంతో ఎవరి వంట వాళ్లు వండుకుని తినేలా రూల్‌ పెడతానని జెస్సీని హెచ్చరించాడు శ్రీరామ్‌. జెస్సీ(Jessie) ఫుడ్‌ జెస్సీనే వండుకుని తినాలని ఆదేశించాడు. దీంతో హర్ట్‌ అయిన జెస్సీ.. నాకు ఫుడ్‌ పెట్టరంట, నా ఫుడ్‌ నేనే వండుకోవాలంట అని చెప్పడంతో సిరి, షణ్ను సీరియస్‌ అయిపోయారు. 'ఇదేమీ నీ ఇల్లు కాదు, బిగ్‌బాస్‌ హౌస్‌' అని కెప్టెన్‌ మీద విరుచుకుపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా మధ్యలోకి రాకంటూ హెచ్చరించాడు శ్రీరామ్‌(Sreerama Chandra). ఎవరి ఫుడ్‌ వాళ్లు వండుకోవాలని చెప్పడానికి నువ్వెవరివి? జస్ట్‌ కెప్టెన్‌వి అంతే! అని అగ్గి మీద గుగ్గిలమైంది సిరి(Siri Hanmanth). నేనేం చేయాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదని రివర్స్‌ కౌంటరిచ్చాడు శ్రీరామ్‌. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News