Devara 2 Update: జూనియర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ, జాన్వీ కపూర్ , సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం దేవర.. ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 55 రోజులు పైనే కావస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల అయ్యి, ఎన్టీఆర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైనప్పుడు కాస్త నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ చివరికి మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకొని, కలెక్షన్స్ కూడా రూ.550 కోట్లకు పైగా రాబట్టింది. సినిమా చేస్తున్న సమయంలోనే దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు డైరెక్టర్ కొరటాల శివ.
ఇటీవల దేవర సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత రెస్పాన్స్ చాలా తగ్గిపోయిందని, థియేటర్లో విడుదలైనప్పుడు సోషల్ మీడియాలో కూడా కాస్త నెగెటివిటీ ఎక్కువ అవ్వడం చేత ఎన్టీఆర్ అభిమానులు సైతం దేవర సినిమాని ఎలాగోలాగా సక్సెస్ చేశారు.
అయితే చివరికి ఓటీటీలోకి వచ్చిన తర్వాత కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమా చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయం అటు ఎన్టీఆర్ అభిమానుల వరకు వచ్చిందని సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్ లోని కొన్ని సన్నివేశాలు సరిగ్గా లేవని, సెకండ్ పార్ట్ తీయడానికి ఇచ్చిన లీడ్ కూడా సరిగ్గా లేదని పలు రకాల వార్తలను కొంతమంది నెటిజన్స్ వైరల్ గా చేశారు.
అందుకే దేవర-2 వెనుక అభిమానులు కాస్త అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా దేవర తరహాలోనే దేవర-2 ఉంటే ఈ సినిమాని ఆడించడం కష్టమని, అందుకే చిత్ర బృందం సీక్వెల్ తియ్యాలా వద్దా అని అభిప్రాయం గురించి కూడా చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. నిజానికి మొదటి భాగం ఫెయిల్యూర్ అయితే రెండవ భాగాన్ని ఆపి వేస్తారు .
కానీ దేవర సినిమా విషయంలో మొదటి భాగం థియేటర్లో సక్సెస్ అయ్యి ఓటీటిలో ఆకట్టుకోలేకపోవడంతో ఇప్పుడు దేవర-2 తీయాల వద్ద అనే సందిగ్ధంలో చిత్ర బృందం పడ్డట్లుగా సమాచారం. మొత్తానికి దేవర-2 విషయంలో ఫ్యాన్స్ కి నిరాశ తగులుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Read more: Tirumala: తిరుమలలో మళ్లీ ఘోర అపచారం.. మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఘటన.. ఏంజరిగిందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.