Bhola Shankar Trailer Released: మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ భోళా శంకర్. తమన్నా భాటియా హీరోయిన్గా నటిస్తుండగా.. కీర్తీ సురేష్ మెగాస్టార్ చెల్లెలి పాత్రలో యాక్ట్ చేస్తోంది. సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సతి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా.. సహ నిర్మాతలుగా అనిల్ సుంకర, అజయ్ సుంకర వ్యవహరిస్తున్నారు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. ఆగస్టు 11న ఆడియన్స్ ముందుకు రానుండుగా.. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తమిళ సినిమా 'వేదాళం'కు ఇది రీమేక్‌గా రూపొందింది. అభిమానులకు అంచనాలకు తగ్గట్లే మెగాస్టార్ డైలాగ్స్‌తో అలరించారు.
భోళా శంకర్ ట్రైలర్ 2.20 నిమిషాల నిడివి ఉంది. డైరెక్టర్ మెహర్ రమేష్ మెగాస్టార్‌ను సరికొత్తగా చూపించాడు. చిరంజీవి యంగ్‌గా.. గ్రేస్‌ఫుల్‌గా అదగొట్టారు. కామెడీ టైమింగ్, డ్యాన్సులలో తన గ్రేస్ ఇంకా తగ్గలేదని నిరూపించారు. తెలంగాణ యాసలో చిరు డైలాగ్స్ అలరించారు. "పబ్లిక్ గిట్లా ప్రాబ్లమ్ వస్తే పోలీసుల దగ్గరికి పోతారు. గదే పోలీసులకు గిట్లా ప్రాబ్లమ్ వస్తే భోళా భాయ్ కాడికి వస్తరు" అంటూ హీరో స్టామినాను ఓ పవర్‌ఫుల్‌గా చూపించారు.
ట్రైలర్ చిరు ఎంట్రీ అదిరిపోయింది. అభిమానులకు అంచనాలకు తగ్గట్టే స్టైలు, గ్రేసుతో మైమరిపించారు. పవర్ కళ్యాణ్ మేనరిజంలో డైలాగ్స్ చెప్పిన వీడియోను ఇటీవల చిరు లీక్ చేయగా.. ట్రైలర్లో ఒక సీన్‌ను యాడ్ చేశారు. పోలీస్ ఆఫీసర్‌గా షియాజీ షిండే మెప్పించగా.. హీరోయిన్ తమన్నా లాయర్ పాత్రలో యాక్ట్ చేసింది. 'రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడురా' అంటూ కోర్టులో తమన్నా చెప్పే డైలాగ్స్‌కు విజిల్స్ పడతాయి.
వెన్నెల కిశోర్ కామెడీ ఓ రేంజ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్‌ను నా తమ్ముడు అంటూ ట్రైలర్ హాస్యం పుట్టించాడు. జడ్జిగా బ్రహ్మానందం వినోదాన్ని పంచనుంది. భోళా జీ అంటూ శ్రీముఖి కూడా ఆకట్టుకుంది. కథ అందరికీ తెలిసిందే కాగా.. చాలా రోజుల తరువాత మెగాఫోన్ పట్టిన మెహర్ రమేష్ ఎలా తెరకెక్కించారనేది ఆసక్తికరం. దాదాపు దశాబ్దం తరువాత దర్శకత్వం వహిస్తున్నా.. మెగా అభిమానుల ఎక్స్పెక్ట్ చేసినట్లే ట్రైలర్‌ను పవర్ ప్యాక్ మాస్ మసాలగా అందించాడు. ట్రైలర్‌తో భోళా శంకర్‌పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
Also Read: Telangana Rain Updates: అర్ధరాత్రి అభయారణ్యంలో 80 మంది పర్యాటకులు.. ఒక్క ఫోన్ కాల్‌తో..!
Also Read: Revanth Reddy: విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.. వర్షాలపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook