Bheemla Nayak Shooting : భీమ్లా నాయక్ షూటింగ్‌ స్పాట్‌లో పవన్ ఫ్యాన్స్ సందడి..

Pawan Kalyan fans in Bheemla Nayak Shooting: పవన్‌ కల్యాణ్‌ భీమ్లా నాయక్‌ మూవీ ప్రస్తుతం వికారాబాద్‌లో జరుగుతోంది. ఎల్లమ్మ ఆలయం దగ్గర కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ఫ్యాన్స్ పవర్ స్టార్‌‌తో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 04:35 PM IST
  • వికారాబాద్‌లో భీమ్లా నాయక్‌ షూటింగ్
  • ప్రస్తుత షెడ్యూల్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • షూటింగ్ స్పాట్‌కు భారీగా తరలివచ్చిన జనాలు
Bheemla Nayak Shooting : భీమ్లా నాయక్ షూటింగ్‌ స్పాట్‌లో పవన్ ఫ్యాన్స్ సందడి..

Bheemla Nayak Shooting in Vikarabad Pawan Kalyan fans gathering in shooting spot : పవన్‌ కల్యాణ్‌, రానా కాంబోలో వస్తోన్న మూవీ భీమ్లా నాయక్‌. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్‌లోని (Vikarabad) మదన్ పల్లిలో జరుగుతోంది. అక్కడ ఎల్లమ్మ ఆలయం దగ్గర కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. అలాగే ప్రస్తుత షెడ్యూల్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారట. షూటింగ్ స్పాట్‌కు (Shooting spot‌) జనాలు భారీగా తరలివచ్చారు. పవన్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. పవన్​ కల్యాణ్‌ అభిమానులందరికీ (Pawan Kalyan fans) అభివాదం చేస్తూ షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లారు. చాలా మంది ఫ్యాన్స్ పవర్ స్టార్‌‌తో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు.

 

Also Read : IR Camera Through Clothes: వావ్! ఈ స్మార్ట్ ఫోన్ తో లోదుస్తులను స్కాన్ చేయేచ్చు- అదెలాగో తెలుసుకోండి!

అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీకి ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లు. ఈ మూవీకి సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) మాటలు అందిస్తున్నారు. తమన్‌ (Taman‌) మ్యూజిక్ సమకూరుస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోన్న ఈ మూవీ 2022 జనవరి 12న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read : Omicron: చాప కింద నీరులా ఒమిక్రాన్... ఢిల్లీలో కొత్తగా మరో 10 కేసులు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News