Bheemla Nayak Pre Release: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు షాక్.. భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా!

Bheemla Nayak Pre Release Event: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది! సోమవారం జరగాల్సిన 'భీమ్లా నాయక్' ప్రీ - రిలీజ్ ఈవెంట్ ను చిత్రబృందం వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం కారణంగా.. ఆయన మృతికి సంతాపంగా ప్రీ - రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2022, 12:32 PM IST
    • పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు నిరాశ
    • భీమ్లా నాయక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా
    • ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాపం ప్రకటన
Bheemla Nayak Pre Release: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు షాక్.. భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా!

Bheemla Nayak Pre Release Event: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 25) సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రీ - రిలీజ్ ఈవెంట్ ను సోమవారం అనగా ఫిబ్రవరి 21 సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్‌గూడ పోలీస్‌గ్రౌండ్స్‌లో నిర్వహించాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం కారణంగా చిత్ర ప్రీ - రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర మేకర్స్ సితార ఎంటర్ టైన్మెంట్స్ ట్విట్టర్ లో ప్రకటించింది. 

'భీమ్లా నాయక్' సినిమా ప్రీ - రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తారక రామారావు రావాల్సి ఉంది. వీరితో పాటు మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ వేడుకలో పాల్గొనాల్సి ఉంది. అయితే విడుదలకు ముందస్తు వేడుకను వాయిదా వేయగా.. తిరిగి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై నిర్మాణ సంస్థ స్పష్టత ఇవ్వలేదు.  

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి సరసన నిత్యా మేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు.  

Also Read: Bheemla Nayak Trailer: పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. భీమ్లా నాయక్ ట్రైలర్ అప్డేట్!

Also Read: Shaakuntalam First Look: శాకుంతలం మూవీ ఫస్ట్ లుక్.. అందాల దేవకన్యగా సమంత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News