Beast Movie Review: బీస్ట్ మూవీ రివ్యూ.. సినిమాపై మిశ్రమ స్పందన..??

Beast Movie Review: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌, పూజా హెగ్డే కలిసి నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'బీస్ట్'. ఈ చిత్రం గురువారం (ఏప్రిల్ 13)న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం.    

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2022, 11:19 AM IST
    • గురువారం థియేటర్లలో విడుదలైన విజయ్ దళపతి 'బీస్ట్'
    • తమిళనాడులో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి
    • విజయ్ నటన, యాక్షన్ సీక్వెన్స్ సూపర్ అంటున్న అభిమానులు
Beast Movie Review: బీస్ట్ మూవీ రివ్యూ.. సినిమాపై  మిశ్రమ స్పందన..??

Beast Movie Review: స్టార్ హీరో విజయ్‌ దళపతి, పూజా హెగ్డే కలిసి నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'బీస్ట్'. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం గురువారం (ఏప్రిల్ 13)న థియేటర్లలో విడుదలైంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ కు ఇప్పటికే విశేషాదరణ దక్కింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు ఓవర్సీస్ లో పూర్తయ్యాయి. ఈ క్రమంలో సినిమా ఎలా ఉంది? విజయ్, పూజా హెగ్డే నటన ఎలా ఉంది..? డైరెక్టర్ ప్రేక్షకులను మెప్పించాడా..? అనే విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. 

'బీస్ట్' మూవీపై సోషల్ మీడియాలో ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ వస్తుంది. అయితే మరికొంతమంది ఆకట్టుకునే విధంగా స్టోరీ లేదని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మూవీ పట్ల మిశ్రమ స్పందన వస్తుందని తెలుస్తోంది. కానీ, తెరపై విజయ్ దళపతి చాలా స్ట్రైలిష్ గా కనిపించారని.. అదే విధంగా యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని చెబుతున్నారు. 

తమిళనాడులో తమ అభిమాన హీరో (విజయ్) ను తెరపై చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. సినిమా హాళ్ల ముందు సందడి చేస్తూ.. బాణాసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. అదిరిపోయే ఫైట్ తో హీరో విజయ్ ఎంట్రీ ఉంటుందని అభిమానులు చెబుతున్నారు. విజయ్ నటనతో పాటు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అని ఫ్యాన్స్ వెల్లడించారు. అయితే సినిమా ఫస్టాఫ్ చాలా బాగుందని.. సెంకడ్ ఆఫ్ ఫర్వాలేదనిపించిందని చెప్పుకొచ్చారు. 

'డాక్ట‌ర్' ఫేమ్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌.. 'బీస్ట్' సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రంలో విజయ్ దళపతి సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందన్ మ్యూజిక్ అందించారు. 'డాక్టర్' మూవీలో ప్రత్యేకంగా అలరించిన కమెడియన్స్ ఈ చిత్రంలోనూ నటించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.  

Also Read: Rakul Preet Photos: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సైజ్ జీరో సుందరి!

Also Read: Acharya Trailer Review: మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్.. 'ఆచార్య' ట్రైలర్ అదిరిపోయిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News