BB4: నాల్గోసారి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్.. అఫీషియల్ ప్రకటన..

BB4 - Balakrishna - Boyapati Sreenu: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు మంచి హైప్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ లో  సినిమా వస్తుదంటే ఆడియన్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తుంటారు. తాజాగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నాల్గో సినిమా రాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన బాలయ్య బర్త్ డే సందర్బంగా అనౌన్స్ చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 10, 2024, 09:02 AM IST
BB4: నాల్గోసారి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్.. అఫీషియల్ ప్రకటన..

BB4 - Balakrishna - Boyapati Sreenu:సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కూడా ఆ సినిమా ఎపుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబినేషన్స్‌లో బాలకృష్ణ, బోయపాటి శ్రీనుది  అని చెప్పాలి. గత కొన్నేళ్లలో బాలయ్యతో ట్యూన్ అయిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది బోయపాటి శ్రీను అని చెప్పాలి. అంతేకాదు బాలయ్యలోని ప్లస్ పాయింట్స్ ను ఎలా యూజ్ చేసుకోవాలో బోయపాటికి తెలిసినంత మరె దర్శకుడికి తెలియదని చెప్పాలి. ఎలాంటి సబ్జెక్ట్ తో సినిమా తెరకెక్కిస్తే ఆడియన్స్ పల్స్ పట్టుకోవచ్చనేది బోయపాటికి తెలిసిపోయింది. ఇపుడు సింహా, లెజెండ్, అఖండ్ సినిమాల వంటి హాట్రిక్  హిట్స్ తర్వాత నాల్గోసారి కలిసి పనిచేయబోతున్నారు. BB4 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా అఖండ కు మూవీకి సీక్వెల్ అని చెబుతున్నారు. టైటిల్ లో చక్రం అవి చూపించారు. అఖండ 2 మూవీనే బోయపాటి శ్రీను బాలయ్యతో తెరకెక్కించబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ, రైటింగ్ అన్ని కంప్లీట్ చేసాడు. బాబీ సినిమా తర్వాత BB4 కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది.
అఖండలో చిన్న పాపకు ఇచ్చిన మాట కోసం మళ్లీ రావడం వంటి కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. మరోసారి అఘోరా పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో  ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌లో బాలయ్య ఓల్డ్ గెటప్‌ హైలెట్ అని చెబుతున్నారు. అది  కూడా సాధువుగా కనిపించనున్నాడు.  ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన మొత్తం  స్కెచ్ రెడీ అయిందట. ఇప్పటికే బాలయ్యపై  ఈ క్యారెక్టర్ కు  సంబంధించి టెస్ట్ షూట్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం. ఈ సినిమాను పూర్తిగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో  'అఖండ'ను మించి రీతిలో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడట.

ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో సంజయ్ దత్ నటించబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలబడనుంది. ఈ సినిమాను రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో తొలిసారి బాలయ్య కూతురు తేజస్వీ సమర్పకురాలిగా సినీ రంగ ప్రవేశం చేయబోతుంది. మరి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 109 సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. అంతేకాదు ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అది కూడా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయబోతున్నట్టు సమాచారం.

Read more; Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News