Balakrishna Padma Bhushan: లేటుగా అయినా.. లేటెస్ట్ గా బాలయ్యను కేంద్రం పద్మభూషణ్ ప్రకటించడంపై నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు తెలుగు సినీ రంగం నుంచి తండ్రి ఎన్టీఆర్ పద్మశ్రీ అందుకుంటే.. ఆయన తనయుడు బాలకృష్ణ పద్మభూషణ్ అందుకోవడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి, చంద్రబాబులతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలయ్య.. 50 యేళ్లుగా సినీ రంగంతో పాటు సామాజిక, సేవా రంగాల్లో తనదైన సేవలతో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ పద్మ అవార్డు రావడంపై అభినందన మందార మాలలతో ముంచెత్తుతున్నారు.
అయితే.. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై ఆయన అన్న కుమారుడు టాలీవుడ్ నుంచి ప్యాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటుతున్న జూనియర్ ఎన్టీఆర్ బాబాయికి అభినందలు తెలపడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ రంగంతో పాటు సామాజిక, సేవా రంగాల్లో ఆయన చేసిన సేవలకు గాను కేంద్రం బాలా బాబాయిని ఈ అత్యున్నత అవార్డుకు ఎంపిక చేయడంపై అభినందనలు తెలుపుతూ ఎక్స్ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. గత కొన్నేళ్లుగా బాబాయి అబ్బాయి మధ్య అంత సఖ్యత లేదు. ఇక బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో వస్తోన్న గెస్ట్స్ దగ్గర ఎక్కడా ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా షో రన్ చేస్తున్నారు.
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.
— Jr NTR (@tarak9999) January 25, 2025
ఇలాంటి నేపథ్యంలో బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల ఎన్టీఆర్ ఇపుడు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేయడంపై నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు కళ్యాణ్ రామ్ కూడా బాబాయి బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
సినీ రంగానికి సమాజానికి ఆయన చేసిన సేవలను కేంద్రం గుర్తించి అవార్డు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. అఖండ నుంచి డాకు మహారాజ్ వరకు నాలుగు సక్సెస్ లు అందుకున్నారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.