Balakrishna - Dil Raju: బాలయ్య దిల్ రాజు కాంబో సెట్ అయిందా.. డైరెక్టర్ ఎవరంటే..!

Balakrishna - Dil Raju: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ లో  సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకుంటుంది. ఇలాంటి కాంబినేషన్ లో బాలకృష్ణ, దిల్ రాజు కాంబినేషన్ ఒకటి. గత కొన్నేళ్లుగా వీళ్ల కలయికలో సినిమా కోసం ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తాజాగా వీళ్ల కాంబినేషన్ సెట్ అయింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 25, 2024, 07:30 AM IST
Balakrishna - Dil Raju: బాలయ్య దిల్ రాజు కాంబో సెట్ అయిందా.. డైరెక్టర్ ఎవరంటే..!

Balakrishna - Dil Raju:  టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజుకు తెలుగులో ప్రత్యేక గుర్తింపు వుంది. దాదాపు తెలుగులో అగ్ర హీరోలందరితో సినిమాలు తెరకెక్కించిన ట్రాక్ రికార్డు దిల్ రాజు సొంతం. కానీ తెలుగులో సీనియర్ టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణలతో మాత్రం సినిమాలు నిర్మించలేదు. త్వరలో బాలయ్యతో ఓ భారీ సినిమాను నిర్మించడానికి దిల్ రాజు ప్లాన్ చేసినట్టు సమాచారం. అంతేకాదు బాలకృష్ణ కూడా దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయడానికీ ఓకే చెప్పినట్టు సమాచారం.

ప్రస్తుతం బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో  ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఇయర్ విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ రాబోతుంది. ఈ సినిమా తర్వాత దిల్ రాజు నిర్మాణంలో బాలయ్య సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం బాలయ్య చేస్తోన్న సినిమాల స్టోరీలను ఆయన చిన్న కూతురు తేజస్వినీ వింటోంది. ఇపుడు దిల్ రాజు నిర్మాణంలో చేయబోయే సినిమా డైరెక్టర్ ను కూడా ఆమె నిర్ణయించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ లేదా హరీష్ శంకర్ డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే వీళ్లు బాలయ్య ఇమేజ్ కు తగ్గ స్టోరీలను రెడీ చేసుకున్నట్టు సమాచారం. వీళ్లిద్దరు కాకపోతే.. కొరటాల శివ బాలయ్య 111 సినిమాను దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. దేవర తర్వాత వీళ్ల కాంబో తెరకెక్కే అవకాశాలున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేయనున్నారు. ఏది ఏమైనా బాలయ్య, దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా అనగానే సినీ ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News