Balagam Movie Team in Suma Adda Show: కమెడియన్ వేణు డైరెక్షన్లో ప్రియదర్శి హీరోగా, కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్గా తెరకెక్కిన మూవీ బలగం. మార్చి 3న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ.. సూపర్ సక్సెస్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా సినిమాను రూపొందించడంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. కథ బలంగా ఉంటే చిన్న సినిమాతో అయినా హిట్ కొట్టొచ్చని బలగం నిరూపించింది. ప్రస్తుతం మూవీ టీమ్‌ను సక్సెస్‌ను ఎంజయ్ చేస్తూనే.. వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. తాజాగా సుమ అడ్డా షోలో డైరెక్టర్ వేణు, ప్రియదర్శిని, కావ్యా కళ్యాణ్ రామ్, కమెడియన్ రచ్చ రవి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు.
బలగం సినిమా సూపర్ హిట్ చేసినందుకు ఆడియన్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు వేణు. గంగోత్రి మూవీలో కావ్యా కళ్యాణ్ 'వల్లంగి పిట్ట' సాంగ్‌ను యాంకర్ సుమ గుర్తుచేసింది. ఈ సందర్భంగా సిటీ లైఫ్ బాగుంటుందా..? విలేజ్ లైఫ్ బాగుంటుందా..? అని అడిగింది. గ్రామాల్లో నీళ్ల కోసం బోరింగ్ల దగ్గర జరిగే గొడవలు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని ఓ మహిళా ప్రేక్షకురాలు చెప్పగా.. ప్రస్తుతం ఆ బోరింగ్ల దగ్గర కొట్టుకునేవాళ్లందరూ ట్విట్టర్లో ఉన్నారంటూ అందరినీ నవ్వించింది.
ఈ సందర్భంగా కమెడియన్లు నూకరాజు, ప్రవీణ్ గెటప్స్ వేసుకుని వచ్చి స్టేజ్‌పై కామెడీ పండించారు. 'నాకు తెలిసి మీరు హడావుడిగా ఉన్నారు.. ఈ నిమ్మకాయ తీసుకోని పట్టుకోండి..' నూకరాజు ఓ నిమ్మకాయను సుమకు ఇచ్చాడు. అయితే ఈ నిమ్మకాయ తీసుకున్న సుమ వెంటనే నోట్లో పిండుకుని తాగేసింది. 'సుమక్కా.. సెట్ వాళ్లు నిమ్మకాయలు లేవన్నారని.. లారీ కింద ఉన్నవి తెచ్చేశాను..' అని నూకరాజు చెప్పగా.. సుమ షాక్‌కు గురైంది. ఈ విషయం తెలుకుని అక్కడున్న వారు ఒక్కసారిగా నవ్వేశారు.
అనంతరం క్ష అక్షరంతో పాటలు పాడించి సుమ కామెడీని జనరేట్ చేశారు. వేణు, కావ్యా కళ్యాణ్ తెగ నవ్వేంచేశారు. నీ మొబైల్లో తరుణ్ భాస్కర్, వేణు నంబర్లలో డిలీట్ చేయమంటే ఎవరి నంబర్ తీసేస్తారు..? అని ప్రియదర్శినిని సుమ అడిగింది. తరుణ్ భాస్కర్ నంబరు డిలీట్ చేస్తానని అతను సమాధానం ఇచ్చాడు.
'జబర్దస్త్ అనే ఒక స్టేజ్ మాతో స్టార్ట్ అయింది. ఆ షోలో చేసే 10 నిమిషాల స్కిట్ కూడా చిన్నపాటి డైరెక్షన్లాంటిదే. ఈ సినిమాను నేను కంపార్ట్బుల్గా డైరెక్ట్ చేశానంటే.. జబర్దస్త్‌లో చేసిన స్కిట్ల అనుభవం కూడా ఉపయోగపడింది..' అని వేణు చెప్పుకొచ్చాడు. ఇందుకు సబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.
Also Read: Umesh Yadav: ఉమేష్ యాదవ్ ఇంట పండుగ వాతావరణం.. విషాద సమయంలో గుడ్‌న్యూస్
Also Read: MCLR Rate: హోలీ పండుగ వేళ షాక్.. ఈ బ్యాంక్ వడ్డీ రేట్లు మళ్లీ పెరిగాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.