'అ!' మూవీలో కాజల్ ఫస్ట్ లుక్

నాని తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం "అ!".

Last Updated : Dec 31, 2017, 01:17 PM IST
'అ!' మూవీలో కాజల్ ఫస్ట్ లుక్

నాని తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం "అ!". ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రవితేజ, నిత్యామీనన్, రెజీనా, అవసరాల శ్రీనివాస్ ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేసింది. ఇప్పుడు 'కాజల్' ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. గులాబీ పువ్వు పట్టుకొని దిగాలుగా కూర్చున్న కాజల్ ఫోటోను వివిధ ఫ్రేముల్లో చూపించారు. ఇందులో చేపకు, మొక్కకు వాయిస్ ఓవర్ నాని, రవితేజ ఇచ్చారు. ఈ సినిమాలో కాజల్ కాళీ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది.  ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 

 

Trending News