Aswani Dutt: అశ్వనీదత్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. భారతీయ సిని పరిశ్రమలో వినిపిస్తోన్న పేరు. ప్రభాస్ తో తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీతో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ. 750 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది. అంతేకాదు అన్న ఎన్టీఆర్ చేతులు మీదుగా ప్రారంభమైన వైజయంతి మూవీస్ ఇప్పటికీ అప్రహతంగా దూసుకుపోతుంది. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘ఎదరులేని మనిషి’ సినిమాతో నిర్మాతగా మారారు. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో వైజయంతి మూవీస్ నుంచి సినిమా వస్తుందంటే.. భారీ తనం ఉండాల్సిందే. ఏ హీరోతో సినిమా తెరకెక్కించిన భారీ తనం ఉండాల్సిందే. ఒక అగ్నిపర్వతం, ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్ర ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలే ఉన్నాయి.
అయితే.. అశ్వనీదత్ మాత్రం అప్పట్లో మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన ‘శక్తి’ సినిమాతో నిర్మాతగా పూర్తిగా మునిగిపోయినట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమా కొట్టిన దెబ్బతో కోలుకోవడానికి చాలా యేళ్లే పట్టిందన్నారు. అయితే.. తారక్ కంటే ముందే .. బాలకృష్ణ, శోభన్ బాబులతో అశ్వినీదత్.. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అశ్వమేథం’ సినిమా కూడా అశ్వనీదత్ కు పెద్ద దెబ్బే తగిలింది.
చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత.. బాలయ్య, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా అశ్వనీదత్ తన వైజయంతి మూవీస్ బ్యానర్ లో సినిమా అనౌన్స్ చేశారు. తీరా సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయానికి శ్రీదేవి బాలీవుడు సినిమాలో బిజీగా ఉండటం.. బాలయ్య డేట్స్ తో క్లాష్ కావడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.దీంతో స్టోరీలో కాస్త మార్పులు చేర్పులు చేసి ఇద్దరు హీరోయిన్స్ ను పెట్టారు. మీనా, నగ్మాలతో ఈ సినిమా తెరకెక్కింది.
అప్పట్లోనే దాదాపు 1990లలో రూ. 8 కోట్ల భారీ బడ్జెట్ అంటే మాములు విషయం కాదు. ఈ సినిమాలో శోభన్ బాబు కూడా నటించారు. శోభన్ బాబు, బాలకృష్ణ భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ విలన్ అమ్రిష్ పురి విలన్ గా నటించారు. భారీ స్టార్ క్యాష్టింగ్ తో నిర్మించిన ‘అశ్వమేథం’ సినిమా ఓపెనింగ్స్ పరంగా కుమ్మేసినా.. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం కూడా పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. మొత్తంగా నందమూరి తారక రామారావు చేతులు మీదుగ ప్రారంభమైన వైజయంతి మూవీస్ లో వారి వారసులైన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కించిన సినిమాలతో భారీగా నష్టపోయారు. ఇక జూనియర్ హీరోగా నటించిన ‘స్టూడెంట్ నెంబర్ 1’
సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గ మంచి విజయం సాధించడం విశేషం. తాజాగా ‘కల్కి’ సినిమా విజయంతో అశ్వనీదత్ ప్యాన్ వరల్డ్ నిర్మాతగా మారారు.
Also read: Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook