Venu Swamy: బిగ్‌బాస్‌ షోలోకి వేణుస్వామి ఫిక్స్.. షో వ్యూస్‌ రికార్డులు బద్దలయ్యే అవకాశం?

Astrologer Venu Swamy Entry Bigg Boss Telugu: వీవీఐపీల జాతకాలు చెబుతూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ ట్రెండింగ్‌ ఉన్న జ్యోతిష్యుడు వేణు స్వామి బిగ్‌బాస్‌ షోలోకి అడుగుపెడుతున్నారని సమాచారం. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 3, 2024, 10:07 PM IST
Venu Swamy: బిగ్‌బాస్‌ షోలోకి వేణుస్వామి ఫిక్స్.. షో వ్యూస్‌ రికార్డులు బద్దలయ్యే అవకాశం?

Venu Swamy Bigg Boss: సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో  పాటు ఇతర అనేక అంశాల మీద జ్యోతిష్యం చెబుతూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే వ్యక్తి వేణుస్వామి. వీఐపీల జ్యోతిష్యుడిగా పేరుపొందిన వేణు స్వామి చెప్పిన అంచనాలు వాస్తవం కూడా అయ్యాయి. దీంతో ఆయనకు సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీ వచ్చేసింది. రాజకీయాలు, సినీ ప్రముఖుల విషయాలపై నిత్యం స్పందిస్తూ ట్రెండింగ్‌లో ఉన్న వేణు స్వామికి సంబంధించి బ్రేకింగ్‌ వార్త తెలిసింది. ఆయన త్వరలోనే బిగ్‌బాస్‌ షోలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే ఆ షో రేటింగ్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉంది.

Also Read: Pawan Kalyan: సినిమాలపై పవన్‌ కల్యాణ్‌ సంచలన ప్రకటన.. ఓజీ సినిమాపై ఏం చెప్పారంటే?

 

జ్యోతిష్యం చెబుతూ పాపులారిటీ సంపాదించుకున్న జ్యోతిష్యుల్లో వేణు స్వామి ప్రథమంగా కనిపిస్తారు. అయితే చెప్పిన జ్యోతిష్యంలో ఒక్క చోట మాత్రం వాస్తవం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో విజేత విషయం ఆయన చెప్పిన జ్యోతిష్యం తప్పుగా మారింది. తీవ్ర ఎదురుదెబ్బ తగలడంతో వేణుస్వామికి కొన్ని పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాను జాతకాలు చెప్పడం మానేస్తానని ఆయన సంచలన ప్రకటన చేశారు.

Also Read: Mokshagna: బిగ్‌ బ్రేకింగ్‌.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

 

ప్రస్తుతం ఆయన జ్యోతిష్యాలు చెబుతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. అయితే జ్యోతిష్యం వదిలేసినా వదిలేయకపోయినా ఆయన పాపులారిటీ మాత్రం తగ్గడం లేదు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక వ్యూస్‌ ఆయనవే ఉంటున్నాయి. సోషల్ మీడియాలో ఆయన పోస్ట్‌లు, మీమ్స్‌ అన్నీ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వేణు స్వామి జ్యోతిష్యం చెప్పాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. త్వరలోనే బిగ్‌బాస్‌ 8వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల వేట సాగుతోంది. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో వేణుస్వామికి ఉన్న పాపులారిటీ గుర్తించిన బిగ్‌బాస్‌ నిర్వాహకులు తదుపరి షోలో వేణు స్వామిని అడిగారంట.

ఆయన  క్రేజ్‌ని గుర్తించిన బిగ్‌బాస్ టీం తర్వాతి సీజన్‌లో కంటెసెంట్‌గా పాల్గొనాలనే విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. వేణు స్వామి కోసమైనా చాలామంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారని బిగ్‌బాస్ ప్రతినిధులు భావిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆయన పాపులారిటీ కారణంగా ఆయనను సంప్రదించారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జ్యోతిష్యానికి దూరంగా ఉండడంతో ఈ క్రమంలో అందివచ్చని బిగ్‌బాస్ అవకాశాన్ని వేణుస్వామి కూడా కాదనలేదని తెలుస్తోంది. వేణు స్వామి త్వరలోనే బిగ్‌బాస్‌లో కనిపించబోతున్నారని బుల్లితెర వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

భారీగా పారితోషికం
వీఐపీల జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన వేణు స్వామి బిగ్‌బాస్‌ షోకు సంబంధించి భారీగా పారితోషికం అడిగారని కూడా తెలుస్తోంది. బిగ్‌బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీ తీసుకొని పారితోషికం వేణు స్వామి తీసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది. ఆయన పాపులారిటీని చూసిన బిగ్‌బాస్‌ బృందం ఆయన అడిగినంత ఇచ్చేందుకు ముందుకువచ్చిందని సమాచారం. ఇవే వార్తలు నిజమైతే బిగ్‌బాస్‌లో వేణుస్వామి పాత్ర ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరం. బయట హల్‌చల్‌ చేసిన వేణు స్వామి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలా కనిపిస్తారోనని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News