Aryan Khan Bail : బెయిల్‌పై బయటికొస్తున్న ఆర్యన్ ఖాన్‌.. ముస్తాబైన ‘మన్నత్’

Aryan set to be released today: ఆర్యన్‌ఖాన్‌ జైలు నుంచి విడుదల చేయనున్న సందర్భంగా షారుక్‌ ఖాన్‌, గౌరీ ఖాన్‌ల ముంబైలోని ‘మన్నత్’ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అలాగే ఆర్యన్ ఖాన్ తీసుకొచ్చేందుకు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు వద్దకు షారుక్‌ ఖాన్‌ వెళ్లారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2021, 09:11 AM IST
  • జైలు నుంచి విడుదల కానున్న ఆర్యన్ ఖాన్
  • ముస్తాబైన మన్నత్
  • ఆర్థర్ రోడ్ జైలు వద్దకు వెళ్లిన షారుక్‌ ఖాన్‌
 Aryan Khan Bail : బెయిల్‌పై బయటికొస్తున్న ఆర్యన్ ఖాన్‌.. ముస్తాబైన ‘మన్నత్’

Shah Rukh Khan's son Aryan Khan drug case live updates: Shah Rukh Khan leaves for Arthur Road Jail as Aryan set to be released today: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో మూడు వారాల పాటు జైలు జీవితం గడిపిన షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు శనివారం ఉదయం జైలు నుంచి విడుదల కానున్నారు. కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ (Aryan Khan) జైలు నుంచి విడుదల చేయనున్న సందర్భంగా షారుక్‌ ఖాన్‌, గౌరీ ఖాన్‌ల ముంబైలోని ‘మన్నత్’ను (Mannat) విద్యుత్ దీపాలతో అలంకరించారు. అలాగే ఆర్యన్ ఖాన్ తీసుకొచ్చేందుకు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు (Arthur Road Jail) వద్దకు షారుక్‌ ఖాన్‌ వెళ్లారు. 

 

రంగురంగుల విద్యుత్ దీపాలతో షారూఖ్ ఇళ్లు ముస్తాబు అయ్యింది. అభిమానులు మన్నత్‌కు (Mannat) చేరుకుని ఆర్యన్ ఖాన్‌ విడుదల కానుండటంతో సంబరాలు చేసుకున్నారు. కొందరు అభిమానులు ‘మన్నత్’ (Mannat) వెలుపల భారీ పోస్టర్లు పట్టుకొని బాణసంచా పేల్చారు.

Also Read : Amit Shah: కేందంలో మోదీ-యూపీలో యోగీ నినాదంతో అమిత్ షా

అయితే డ్రగ్స్ కేసులో (drug case) అరెస్టయిన షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌కు బెయిల్‌ లభించినప్పటికీ ఇవాళ ఉదయం వరకు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఎదురైంది. బెయిల్‌ షరతులకు సంబంధించిన పత్రాలు నిర్దిష్ట సమయంలో అంటే సాయంత్రం 5.30 గంటలలోపు.. ఆర్థర్‌ రోడ్‌ జైలు అధికారులకు అందకపోవడంతో ఆర్యన్‌ విడుదలకు వీలులేకుండా పోయింది. దీంతో శుక్రవారం రాత్రి కూడా ఆర్యన్‌ జైల్లోనే గడపాల్సి వచ్చింది.

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఉత్తర్వులను న్యాయస్థానం శుక్రవారం జారీ చేసింది. మొత్తం 14 షరతులు విధిస్తూ ఆర్యన్‌కు (Aryan) బెయిల్‌ ఇచ్చింది. 

ఇందులో రూ.లక్ష బాండ్‌ ఒకటి. ఈ బాండ్‌కు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో నటి జూహీ చావ్లా షూరిటీగా సంతకం చేశారు. కోర్టు ఉత్తర్వులను తీసుకుని ఆర్యన్ ఖాన్ బెయిల్‌ (Aryan Khan Bail) కోసం షారుక్‌ (Shah Rukh) న్యాయ బృందం జైలుకు వెళ్లినా నిర్దిష్ట సమయం ముగిసిపోయింది.

Also Read : Cyclone Alert: బంగాళాఖాతంలో మరో తుపాను, భారీ వర్షాల హెచ్చరిక జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News