ఆసక్తి రేపుతున్న అరవింద సమేత పాటల జాబితా ఇదే

అరవింద సమేత పాటల జాబితా

Last Updated : Sep 19, 2018, 05:17 PM IST
ఆసక్తి రేపుతున్న అరవింద సమేత పాటల జాబితా ఇదే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న అరవింద సమేత సినిమా ఆడియో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆ చిత్ర మ్యూజిక్ కంపోజర్ ఎస్ఎస్ థమన్ తాజాగా ఆ సినిమా పాటల జాబితాను అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అనగనగనగా పాట ఇంటర్నెట్‌లో సందడి చేస్తుండగా ఇవాళ సాయంత్రం పెనివిటి అనే మరో పాట ఆడియెన్స్ ముందుకు రానుంది. మొత్తం నాలుగు పాటలున్న ఈ సినిమాలో ఒక్కో పాటకు ఒక్కో ప్రత్యేకత ఉన్నట్టు పాటల జాబితా చూస్తే స్పష్టమవుతోంది. అనగనగనగా పాటను అర్మాన్ మాలిక్ చేత పాడించిన థమన్.. పెనివిటి పాటను కాల భైరవతో పాడించాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, పెంచలదాస్ కలిసి రచించిన ఏడ పోయినాడో అనే పాటను నిఖిత శ్రీవల్లి, కైలాశ్ ఖేర్, పెంచల్ దాస్ కలిసి పాడారు. నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా కోసం హిప్‌హాప్ తమీజ కంపోజిషన్‌లో పెంచల్ దాస్ రచించి పాడిన దారి చూడు దుమ్ము చూడు మామా పాట ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. 

Aravinda Sametha songs list

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్... రామజోగయ్య శాస్త్రి రచించిన 'రెడ్డి ఇక్కడ సూడు' అనే పాటను దలేర్ మొహందీ, అంజనా సౌమ్య కలిసి పాడారు. అరవింద సమేత సినిమాలో ఇలా ఒక్కో పాటకు ఒక్కో ప్రత్యేకత ఉన్నట్టుగా థమన్ విడుదల చేసిన పాటల జాబితా చెబుతోంది.

Trending News