AP Minister Perni Nani: ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు.. తక్కువ ధరకే సినిమా టికెట్లు

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ (Minister Perni Nani speech in AP assembly sessions).. తక్కువ ధరకే టికెట్ల విక్రయాలతో పాటు, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే సినిమా టికెట్ల బుకింగ్ సిస్టం తీసుకురావడానికి వెనుకున్న ప్రయోజనాలను వివరించారు. ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై సైతం సినిమాటోగ్రఫి శాఖ మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 10:50 PM IST
AP Minister Perni Nani: ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు.. తక్కువ ధరకే సినిమా టికెట్లు

Minister Perni Nani speech in assembly: ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు రోజుకు కేవలం 4 షోలకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఏపీలో సినిమా టికెట్ బుకింగ్‌కి సంబంధించి ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై సైతం సినిమాటోగ్రఫి శాఖ మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. నేటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ (Minister Perni Nani speech in AP assembly sessions).. తక్కువ ధరకే టికెట్ల విక్రయాలతో పాటు, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే సినిమా టికెట్ల బుకింగ్ సిస్టం తీసుకురావడానికి వెనుకున్న ప్రయోజనాలను వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) మాట్లాడుతూ.. రాష్ట్రంలో సినిమా టికెట్ల బుకింగ్ ఆన్‌లైన్ చేయడాన్ని కొన్ని రాజకీయ పార్టీలే రాజకీయం చేస్తున్నాయి తప్పితే ఈ నిర్ణయం వల్ల ఎవ్వరికీ వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సిస్టం వల్ల టికెట్ల విక్రయాల్లో చోటుచేసుకుంటున్న అవినీతికి ఫుల్‌స్టాప్ పెట్టొచ్చన్నారు. 

''చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద చిత్రాలకు వచ్చిన వసూళ్లకు, ఆయా చిత్రాల వల్ల వినోద పన్ను రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి ఎక్కడా పొంతన కనబడటం లేదు. కొన్ని సినిమాలు భారీ మొత్తంలో వసూళ్లు సాధించినప్పటికీ.. అవేవీ అధికారికంగా రికార్డుపైకి రావడం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్ కూడా (Producers evading tax) రావడం లేదు. ఈ మోసానికి ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టం తెరదించుతుంది'' అని మంత్రి పేర్ని నాని తెలిపారు.

అన్నింటికి మించి పేదవాడికి ప్రధాన వినోదమైన సినిమా ప్రదర్శన ఇటీవల కాలంలో ఖరీదైన వ్యవహారంగా మారిందని మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ కలిసి ఎవరికి నచ్చిన విధంగా వారు రేట్లు పెంచి సినిమాలు ప్రదర్శించడం వల్ల పేదోడి జేబు గుల్లవుతోందని మంత్రి పేర్ని నాని ఆవేదన వ్యక్తంచేశారు. అభిమానుల బలహీనలతను ఆసరగా చేసుకుని భారీ మొత్తంలో రేట్లు పెంచి పేదొడి వీక్‌నెస్‌ని సొమ్ము చేసుకుంటున్నారని, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా టికెట్లు అమ్మడం (Film tickets online) ప్రారంభిస్తే.. అందరికీ తక్కువ ధరలోనే టికెట్స్ అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు.

Trending News