Software engineer raped: హైదరాబాద్ లో మరో ఘోరం... సాఫ్ట్ వేర్ యువతిపై డైరెక్టర్ అత్యాచారం.. అసలేం జరిగిందంటే..?

Hyderabad: హైదరాబాద్ లో మరో సాఫ్ట్ వేర్ యువతిపై డైరెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రచ్చగా మారింది. దీనిపై అధికారులు ప్రస్తుతం డైరెక్టర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 1, 2024, 09:55 AM IST
  • చాన్స్ ఇస్తానని సాఫ్ట్ వేర్ యువతిపై దారుణం..
  • డిన్నర్ కు ఇంటికి పిలిచి..
Software engineer raped: హైదరాబాద్ లో మరో ఘోరం... సాఫ్ట్ వేర్ యువతిపై డైరెక్టర్ అత్యాచారం.. అసలేం జరిగిందంటే..?

Another software engineer raped in Hyderabad assistant director Siddharth varma: కామాంధులు రెచ్చిపోతున్నారు. పడుచమ్మాయి నుంచి పండుముసలి వరకు ఎవర్ని వదలడం లేదు. గుడి, బడి, బస్టాండ్, రైల్వే స్టేషన్ లు ప్రతిచోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు. కొన్ని చోట్ల ఇంట్లో తోబుట్టువులు, కాపాడాల్సిన కన్నవాళ్లు సైతం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.ఈ నేపథ్యంలో..అన్యాయం జరిగింది కదా..అని పోలీస్ స్టేషన్ లకు వెళ్తే అక్కడ కూడా వేధింపులకు ఎదురౌతున్నాయి.

కొందరు పోలీసులు కూడా బాధిత యువతుల్ని వేధిస్తున్నారు. తమకు లైంగికంగా సహాకరించాలని, బెదిరింపులకు గురిచేస్తున్నారు. మాట వినకుండా.. కేసుల్లో ఇరికిస్తామంటూ టార్చర్ పెడుతున్నారు. కొన్నిచోట్ల సినిమా వాళ్లు కూడా డైరెక్టర్ లు, నిర్మాతలు చాన్స్ ఇస్తానంటూ యువతుల్ని వేధిస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలలో తరచుగా హీరోయిన్లు కూడా వేధింపులకు గురైన ఘటనలను పబ్లిక్ గా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఒక టెకీకి, యువ డైరెక్టర్ సినిమాలో చాన్స్ ఇస్తానని లోబర్చుకున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

పూర్తి వివరాలు..

హైదరాబాద్ కొన్ని రోజులుగా అత్యాచారాలు, హత్యలు వేధింపులు ఎక్కువైపోయాయి. ఇటీవల టెకీ ఉద్యోగం వచ్చిందని చెప్పి, పార్టీ ఇవ్వడానికి తన చిన్న నాటి మిత్రుడితో కలిసి బార్ కు వెళ్లగా అతగాడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే విధంగా బస్సులో.. డ్రైవర్ ఒక మహిళ నోటిలో గుడ్డలు కుక్కి నిర్భయ మాదిరిగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇవి మరువక ముందే.. సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ పై దారుణం జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెనుదుమారంగా మారింది.  

సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్.. ఒకసాఫ్ట్ వేర్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న వైజాగ్ కు చెందిన సిద్దార్థ్ వర్మ(30) సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ పుప్పలగూడలో నివాసం ఉంటూ ఐటీ కారిడార్‌లోని ఓ సాప్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తున్న  యువతితో పరిచయం ఏర్పడింది.

Read more: Uttar Pradesh: రోడ్డుపైన ఘోరం.. వర్షంలో తడిచిన మహిళ మీద నీళ్లు చల్లుతూ, అసభ్యంగా తాకుతూ.. వీడియో వైరల్..

యువతిని ట్రాప్ చేసి, ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని చెప్పి.. డిన్నర్ కోసం ఇంటికి రమ్మన్నాడు. అప్పటికే సిద్ధార్థ్ వర్మ.. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాక.. తన కామవాంఛను తీర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో యువతి మత్తు నుంచి బైటపడ్డాక తన ఇంటికి వెళ్లింది. జరిగిన ఘోరం గురించి తన వాళ్లకు చెప్పి, గచ్చిబౌలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్న గచ్చిబౌలి పోలీసులు సిద్దార్థ్ వర్మ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News