Anajli Marriage: ప్రముఖ నిర్మాతను పెళ్లి చేసుకోనున్న అంజలి.. ఇంతకీ ఎవరంటే..

Anajli Marriage: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఒక్కొక్కరు పెళ్లి పీఠలు ఎక్కేస్తున్నారు. ఈకోవలో ప్రముఖ అచ్చ తెలుగు కథానాయిక అంజలి త్వరలో ఓ ప్రముఖ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 24, 2024, 01:39 PM IST
Anajli Marriage: ప్రముఖ నిర్మాతను పెళ్లి చేసుకోనున్న అంజలి.. ఇంతకీ ఎవరంటే..

Anajli Marriage: తెలుగు సినీ ఇండస్ట్రీ సహా ఏ ఇండస్ట్రీలోనైనా హీరోయిన్ కెరీర్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. కొంత మంది మాత్రమే ఏళ్లకు ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతుంటారు. అందుకే చాలా మంది కథానాయికలు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకొని సినిమాలకు ప్యాకప్ చెప్పేస్తుంటారు. కానీ కొంత మంది మాత్రం పెళ్లి తర్వాత హీరోయిన్‌గా కెరీర్‌ను కంటిన్యూ చేస్తున్నారు. ఇక అచ్చ తెలుగు హీరోయిన్ అంజలి కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అది కూడా తెలుగులో అగ్ర నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించిన అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

హీరోయిన్ అంజలి విషయానికొస్తే..చాలా మంది ఇంట గెలిచి రచ్చ గెలుస్తుంటారు. కానీ అంజలి మాత్రం పక్క ఇండస్ట్రీ అయిన తమిళంలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో రచ్చ చేయడం విశేసం. ఈమె తెలుగులో వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కిన సినిమాలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో టైటిల్ రోల్ చేయడం విశేషం. ఆ తర్వాత వెంకటేష్‌తో 'మసాలా' సినిమాలో నటించింది. అటు సీనియర్ హీరో బాలయ్య సరసన డిక్టేటర్ సినిమాలో నటించింది. కానీ కోరకున్న సక్సెస్ మాత్రం దక్కలేదు. అయినా గీతాంజలి వంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఈమె తెలుగులో 'ఫోటో'అనే సినిమాలో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో దాదాపు 20పైగా సినిమాల్లో నటించిన తర్వాత తెలుగులో మళ్లీ గ్రాండ్‌గా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ఇక్కడా కూడా సత్తా చూపెడుతోంది. ప్రస్తుతం అంజలి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో పలకరించబోతుంది. దాంతో పాటు 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' .. రామ్ చరణ్, శంకర్ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

Also read: AP Inter Results 2024: ఏపీ ఇంటర్ పరీక్షలు 2024 ఫలితాలు ఎప్పుడు విడుదలంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News