Animal Movie Box office: బాక్సాఫీస్ వ‌ద్ద‌ ‘'యానిమ‌ల్’' ప్రభంజనం...మూడు రోజుల్లోనే రూ.350 కోట్లు..

Animal Movie: ర‌ణ్‌బీర్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన మూవీ 'యానిమల్'. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ దుసుకుపోతుంది. ఈ చిత్రం మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2023, 02:08 PM IST
Animal Movie Box office: బాక్సాఫీస్ వ‌ద్ద‌ ‘'యానిమ‌ల్’' ప్రభంజనం...మూడు రోజుల్లోనే రూ.350 కోట్లు..

Animal Movie Box office Collcetions: బాక్సాఫీస్ వద్ద రణబీర్ యానిమల్ దుమ్మురేపుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.356 కోట్లు వసూళ్లు సాధించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. తొలి రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.116 కోట్లు వ‌సూలు చేయ‌గా.. రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు కలెక్షన్స్ సాధించింది. మూడో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ ఆదివారం రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం మనదేశంలోనే దాదాపు రూ.201 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. హిందీలో రూ. 176 కోట్లు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి మెుత్తంగా రూ.25 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో యానిమల్ పై విపరీతమైన అంనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రణ్‌బీర్‌ తండ్రిగా అనిల్ కపూర్ నటించాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా , కీలకపాత్రలో బాబిడియోల్ నటించారు. త్రిప్తి డిమ్రి, పృథ్వీరాజ్‌, శక్తి కపూర్‌, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్, రవి గుప్తా, సిద్ధాంత్ కర్నిక్ త‌దిత‌రులు కీలకపాత్రల్లో కనిపించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ అందించిన నేప‌థ్య సంగీతం ఆకట్టుకుంది. అమిత్‌రాయ్ కెమెరా ప‌నిత‌నం బాగుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌, భద్రకాళీ పిక్చర్స్‌, సినీ స్టూడియోస్‌ వన్‌ సంయుక్తంగా నిర్మించాయి. 

Also Read: Ram Charan and Nani: మైసూర్‌ ఆలయంలో చరణ్‌ పూజలు.. కడప దర్గాలో నాని ప్రార్థనలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News