Devara Collections: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైన చిత్రం దేవర. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజే దేశంలోనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన మూడవ చిత్రంగా నిలిచింది. నాన్ రాజమౌళి రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా అప్పుడే కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యిందని తెప్పవచ్చు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయోత్సవంలో చిత్ర బృందం మునిగి తేలుతోంది. అందులో భాగంగానే గుంటూరులోని పెద్దకాకానిలో ఎన్టీఆర్ , దేవర చిత్ర బృందం కలిసి పెద్ద ఎత్తున సక్సెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 4వ తేదీన ఈ ఈవెంట్ నిర్వహించనున్నారని , అందుకు తగిన స్థలాన్ని కూడా పరిశీలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా సక్సెస్ మీట్ నిర్వహణకు కూటమి ప్రభుత్వం అంగీకరించలేదనే వార్తలు ఒక్కసారిగా అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజుతో మహాలయ అమావాస్య పూర్తి కాబోతోంది. రేపటి నుంచి దసరా దేవీ నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని కనకదుర్గమ్మకు దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించనున్నారు.
ఇక్కడకు దేశవ్యాప్తంగా ప్రజలు తమ మొక్కులను తీర్చుకోవడానికి, అలాగే కోరికలు కోరడానికి, అమ్మవారిని దర్శించడానికి పెద్ద ఎత్తున రాబోతున్నారు. ఇక భక్తులను అదుపు చేయడానికి సెక్యూరిటీ చాలా అవసరం. అందుకే చాలామంది పోలీసులు ఇక్కడికి సెక్యూరిటీగా రాబోతున్నారు.
ఈ నేపథ్యంలోనే దేవరా సక్సెస్ మీట్ కి పోలీసులు సెక్యూరిటీగా హాజరు కాలేరని, అందుకే ఈవెంట్ తర్వాత నిర్వహించమని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దేవర చిత్ర బృందం మాత్రం ఇందుకు అంగీకరించకుండా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా ధైర్యం చేసి ఈవెంట్ నిర్వహించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ మూవీ సక్సెస్ మీట్ కోసం పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు తరలివస్తున్నారని.. ఇలాంటి సమయంలో ఏదైనా ఇబ్బంది జరిగితే నష్టం ఎన్టీఆర్ అనుభవించాల్సి ఉంటుందనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మరి ఇన్ని అవాంతరాల మధ్య ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడేమో అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి అభిమానుల కోసం ఎన్టీఆర్ నిర్ణయం ఏ వైపు అన్నాడు తెలియాల్సి ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
Also Read: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.