Andhra Pradesh American Association: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ త్వరలోనే తొలి జాతీయ సదస్సు జరపనుండి. ఈ అసోసియేషన్ ఈవెంట్ అధ్యక్షులు హరి.. ఈ సదస్సు గురించి కొన్ని వివరాలను తెలియజేశారు. “ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నిర్వహిస్తున్న.. తొలి జాతీయ సదస్సుకు ఆహ్వానం లభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుక మన సాంస్కృతిక సంప్రదాయాలకు వారసత్వంగా జరుపుకునేది. ఈ వేడుకలో మీరు అందరూ సంతోషంగా పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాను. ఈ ఏడాది సదస్సు కొన్ని అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలతో మర్చిపోలేని విధంగా ఉండబోతోంది” అంటూ చెప్పుకొచ్చారు.
“సాంప్రదాయ నృత్యాలు, వీణ ప్రదర్శనలు, మంచి సంగీత ప్రదర్శనలు, ప్రముఖ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ లతో వినసొంపైన సంగీత కచేరీలు కూడా ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణలుగా ఉండబోతున్నాయి. అంగరంగ వైభవం జరగనున్న ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ తెలుగు చిత్ర నటుడు హాజరై పెద్ద పండగలా జరుపుకోబోతున్నారు. మన తెలుగు సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతిరూపం రంగవల్లులు. అలాంటి ముగ్గులు తెలుగు లోగిళ్ళలో పండగ కళ తీసుకొస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ముగ్గుల పోటీని కూడా నిర్వహిస్తున్నాం. అలాగే షార్ట్ వీడియోలని తీసి రీల్స్ పోటీ లో కూడా పాల్గొని మీ ప్రతిభను చాటవచ్చు.
దీంతో పాటు దర్శకులు కావాలి అనుకునే వారు షార్ట్ ఫిల్మ్ పోటీ లో పాల్గొనాలి. మీ ప్రత్యేక కథలను ప్రదర్శించడానికి ఈ అవకాశం తప్పకుండా వినియోగించుకోండి. సంగీత పోటీలు కూడా మీ ప్రతిభను బయటకు తీసుకురానున్నాయి. ఈ అవకాశాలు ఏమాత్రం వదులుకోవద్దు. విజేతలకు భారీ ప్రైజ్ మనీ కూడా ఉంది,” అని తెలిపారు హరి.
“ఇన్ని అన్ a వేడుకలో ఆంధ్రప్రదేశ్ వంటకాల లేకుండా ఎలా ఉంటుంది. అన్ని జిల్లాల ప్రత్యేక ఆహార పదార్థాలతో, రుచికరమైన పిండి వంటలు, ప్రత్యేక వంటలు, పచ్చళ్ళతో పాటు మన ఆంధ్ర ఆహారపు అలవాట్లను కూడా ఇక్కడ రుచి చూడవచ్చు.
AAA సంస్థ, లేదా AAA మొదటి జాతీయ సదస్సు గురించి మరిన్ని వివరాల కోసం దయచేసి https://nationalconvention1.theaaa.org వెబ్ సైట్ ని సందర్శించండి. ఈ పోటీల కోసం ప్రైజ్ మనీ వివరాలు, రిజిస్ట్రేషన్, గడువు తేదీలు కూడా తెలుసుకొని, వివరాలు నమోదు చేయండి. త్వరలోనే పేపర్ ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు కూడా బయటకు రానున్నాయి. అందులో ఇంకా ఎన్నో వివరాలు ఉంటాయి. మీరు ఈ పోటీల్లో పాల్గొనడానికి అవసరమైన సమాచారం అందులో కూడా ఉంటుంది.
ఇది ఒక చిన్న సదస్సు కాదు.. ఇది మన సంస్కృతి పట్ల ప్రేమను, కృతజ్ఞతను తెలియజేసే ఒక అవకాశం. ఆలస్యం చేయకుండా మీ ఆలోచనలతో ఈ సదస్సును మరుపురాని విధంగా మార్చే ప్రయత్నం చేయండి,” అని చెప్పుకొచ్చారు. మీ అందరి ప్రతిభను చూడటానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటాము అని AAA వారు ప్రకటించారు.
Read more: Tirumala: ఒక్కరోజులోనే తిరుమల దర్శనం.. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్ ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.