Anasuya Father died: యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం..అనారోగ్యంతో ఆమె తండ్రి మృతి..

Anasuya Father died: యాంకర్ అన‌సూయ ఇంట్లో విషాదం నెల‌కొంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తండ్రి సుదర్శన్ రావు తార్నాకలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 12:45 PM IST
Anasuya Father died: యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం..అనారోగ్యంతో ఆమె తండ్రి మృతి..

Anasuya Father died: ప్రముఖ యాంకర్, సినీనటి అనసూయ(Anchor Anasuya) ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు(sudharshan rao) అనారోగ్యంతో కన్నుమూశారు. 63 ఏళ్ల సుదర్శన్ రావు కొంతకాలం నుంచి క్యాన్సర్​తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తార్నాకలోని నివాసంలో సుదర్శన్ రావు తుదిశ్వాస విడిచారు. దీంతో అనసూయ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు అనసూయ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు.

Also Read: Sirivennela Last Song: అదే తన చివరిపాటను సిరివెన్నెలకు ఎలా తెలుసు, చనిపోతానని తెలుసా

అనసూయ తండ్రి సుదర్శన్ ఓ వ్యాపారవేత్త. తన తల్లి పేరునే అనసూయకు పెట్టుకున్నాడు. రాజీవ్ గాంధీ కాలంలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రెటరీగా పనిచేశారు. సుదర్శన్ రావుకు అనసూయతోపాటు మరో కుమార్తె ఉంది. కాగా, అనసూయ డిసెంబరు 17న 'పుష్ప' సినిమా(Pushpa Movie)తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటే 'ఆచార్య', 'భీష్మ పర్వం', 'ఖిలాడి', 'పక్కా కమర్షియల్',​' రంగ మార్తాండ' సినిమాలు చేస్తోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News