Anasuya Bharadwaj Responded on Gays: ఒక న్యూస్ ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ అతి తక్కువ కాలంలోనే ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టి యాంకర్ గా నిలదొక్కుకుంది. ఈ రోజు తెలుగులో ఉన్న హాట్ యాంకర్స్ లో అనసూయ పేరు కూడా ప్రథమ స్థానంలో కనిపిస్తూ ఉంటుంది. మిగతా యాంకర్లతో పోటీ పడుతూ ఆమె ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తన హాట్ నెస్ అప్డేట్ చేసుకునే పనిలో ఉంటుంది.
అయితే ఈ భామ ఈ మధ్య సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయనే వంకతో తాను ఎప్పటి నుంచో నిలబడటానికి కారణమైన మల్లెమాల సంస్థ చేస్తున్న జబర్దస్త్ వంటి ప్రోగ్రామ్ కు సైతం పుల్ స్టాప్ పెట్టింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి తన క్రేజ్ తగ్గకుండా చూసుకుంటున్న ఈ భామ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే అనసూయ భరద్వాజ్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక అభిమానులతో కలిసి చిట్ చాట్ నిర్వహించింది.
ఇలాంటి చిట్ చాట్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ టిఆర్పీ కోసం స్టంట్స్ తగ్గిపోయినప్పుడు తాను మళ్ళీ బుల్లి తెరపై కనిపించే అవకాశం ఉందని పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి మల్లెమాల సంస్థ ఇలాంటి టీఆర్పీ స్టంట్ లు చేయడంలో ఆరి తేరిపోయింది, బహుశా ఆ విషయంలో చిరాకు వచ్చి ఆమె బయటికి వచ్చేసి ఉండవచ్చని టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.
ఇక తాజాగా మీకు ఎప్పుడైనా లెస్బియన్స్ తో అనుభవం ఎదురైందా అని అడిగితే మా ఫ్రెండ్స్, ఫ్యామిలీలలో ‘గే’లు ఉన్నారు. అయితే నాకు వారితో పర్సనల్‌గా ఎలాంటి అనుభవం ఎదురు కాలేదు కానీ ఆన్లైన్లో మాత్రం చాలా జరిగాయి అంటూ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. అయితే లెస్బియన్స్ గురించి ప్రస్తావిస్తే ఆమె లెస్బియన్స్ గురించి చెప్పకుండా ‘గే;ల గురించి చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. లెస్బియన్స్ ఎవరూ కెరీర్లో ఎవరూ ఆమెకు తారసపడి ఉండకపోవచ్చు అని అంటున్నారు
Also Read: Anasuya Comments on Mallemala: TRP స్టంట్లు ఆపేసినప్పుడే మళ్లీ వెళ్తా.. ఆ షోల పరువుతీసిన యాంకర్ అనసూయ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook