Anasuya bharadwaj:ఎట్టకేలకు జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై.. ఆ ప్రశ్నకు మౌనమే సమాధానం!

Anasuya bharadwaj quitting jabardasth Confirmed: తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో అనసూయ షో విడిచి వెళ్ళిపోతున్నట్లుగా ఒక రకంగా క్లారిటీ వచ్చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 24, 2022, 05:05 PM IST
  • జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై
  • తాజా ప్రోమోలో క్లారిటీ
Anasuya bharadwaj:ఎట్టకేలకు జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై.. ఆ ప్రశ్నకు మౌనమే సమాధానం!

Anasuya Bharadwaj quitting jabardasth Confirmed: కొంతకాలం క్రితమే అనసూయ తన జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నానని, జీవితంలో ముందుకు వెళ్లడం కోసం కష్టమైనా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ ఒక సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే ఆమె జబర్దస్త్ వీడియో వెళ్ళిపోతుందని కామెంట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఎట్టకేలకు దానికి అధికారిక ప్రకటన వచ్చేసినట్లే చెప్పాలి. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో అనసూయ షో విడిచి వెళ్ళిపోతున్నట్లుగా ఒక రకంగా క్లారిటీ వచ్చేసింది.

ఈ షోలో అనసూయ పాత్రధారిగా కనిపించిన తాగుబోతు రమేష్ తాను జబర్దస్త్ వీడి వెళ్ళిపోతున్నాను అంటూ వెంకీ మంకీ టీం లీడర్ అయిన వెంకీకి చెప్పడం కనిపిస్తోంది. అదేంటి మీరు చంటి పిల్లలు ఉన్న సమయంలో కూడా వాళ్లను మీ అమ్మగారికి అప్పజెప్పి వచ్చి జబర్దస్త్ చేశారు. అలాంటి మీరు ఈ షో వదిలి వెళ్లిపోవడం ఏంటి అని ప్రశ్నించడంతో అటు అనసూయతో సహా మిగతా వాళ్ళందరూ ఎమోషనల్ అయ్యారు. ఇంద్రజ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ కచ్చితంగా ఈ స్టేజి నిన్ను మిస్ అవుతుంది అనసూయ అంటూ చెప్పడం కనిపిస్తోంది.

అయితే అనసూయ ఎందుకు షో మానేస్తున్నాను అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు కానీ షో మానేస్తున్నట్లయితే దాదాపుగా ఈ వీడియోతో క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సందర్భంగా చలాకీ చంటి కనీసం నెలలో మూడు రోజులు మాకోసం కేటాయించలేవా అంటూ అడగడంతో అనసూయ ఏమీ చెప్పలేక సందిగ్ధావస్థలో నిలబడిపోవడం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ ప్రోమోతో అనసూయ చివరి ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కాబోతుంది అనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది. ఇక అయితే ఈ ఎపిసోడ్ లో అనసూయ ఎందుకు దూరమవుతుంది అనే విషయాన్ని ఏమైనా చెప్పిందో లేదో కూడా చూడాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News