Anchor Anasuya looks stunning in Latest Photoshoot: 1979లో అనసూయ భరద్వాజ్ హైదరాబాద్‌లో జన్మించారు. 2008లో భద్రుక కళాశాల నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
ఎంబీఏ పూర్తయిన అనంతరం ఫిక్స్ లాయిడ్ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అసూయ.. ఆపై సాక్షి టీవీలో టెలివిజన్ వ్యాఖ్యాతగా చేశారు.
కామెడీ షో 'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచమైన అనసూయ.. అనతి కాలంలోనే పాపులర్ అయ్యారు. తన అందం, యాంకరింగ్‌తో అందరిని ఆకట్టుకున్నారు. కేవలం అను కోసమే జబర్దస్త్ షో చూసే వారు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అనసూయ బుల్లితెరపై మాత్రమే కాకుండా.. వెండితెరపై కూడా సత్తాచాటుతున్నారు. తాను నటిస్తున్న సినిమాలో భిన్న పాత్రల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
క్షణం, రంగస్థలం సినిమాలో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక పాన్ ఇండియా సినిమా 'పుష్ప' చిత్రంతో మరింత పాపులర్ అయ్యారు.ఆపై 'ఖిలాడి' సినిమాలో అనసూయ అందాల ప్రదర్శన చేశారు.
అనసూయ ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్ వస్తుంటాయి.
డల్లాస్ పర్యటనలో ఉన్న అనసూయ ట్రెండీ వేర్‌లో దర్శనమిచ్చారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. తాజా ఫోటోలలో అందానికే అసూయ పుట్టేలా ఉన్నారు.
Also Read: IND vs SA: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook