Anasuya Bharadwaj : అదే నా తాపత్రయం.. అనసూయ కామెంట్స్ వైరల్

Anasuya Bharadwaj About Her Role అనసూయ తాజాగా తన అభిమానులతో నెట్టింట్లో ముచ్చట్లు పెట్టేసింది. అయితే ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికి అనసూయ సమాధానం చెప్పుకొచ్చింది. అయితే ఎక్కువగా పాజిటిట్ ట్వీట్లకే ఆమె రిప్లై ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2023, 11:52 PM IST
  • నెట్టింట్లో అనసూయ సందడి
  • అభిమానులతో అనసూయ ముచ్చట్లు
  • రంగమార్తాండ, రంగస్థలంపై అనసూయ
Anasuya Bharadwaj : అదే నా తాపత్రయం.. అనసూయ కామెంట్స్ వైరల్

Anasuya Role in Rangamarthanda అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన ఫోకస్ అంతా కూడా వెండితెరపైకి పెట్టేసింది. వరుస సినిమాలతో అనసూయ ఫుల్ బిజీగా ఉంది. అయితే అనసూయ ఇంత బిజీలోనూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంది. తన అభిమానులతో అనసూయ ముచ్చట్లు పెట్టేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అందులో తన పాత్రల గురించి చెప్పుకొచ్చింది.

మామూలుగా అనసూయ అంటే రంగస్థలంలోని రంగమ్మత్త పాత్రే గుర్తుకు వస్తుంది. అందులో సుకుమార్ ఆమెను చూపించిన తీరు, అనసూయ నటించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. ఇక అనసూయ ఈ మధ్య రంగమార్తాండ సినిమాతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. రంగమార్తాండలో కాస్త నెగెటివ్ టచ్ ఉన్న పాత్రను అనసూయ పోషించిన సంగతి తెలిసిందే.

 

నాకు రంగమార్తాండలో మీరు చేసిన పాత్ర నచ్చింది.. కానీ రంగస్థలంలో చేసిన పాత్రే హైలెట్ అనిపిస్తుంది.. మీకు ఏ పాత్ర అంటే ఇష్టమని ఓ నెటిజన్ అనసూయను అడిగారు. దీనికి అనసూయ ఇలా రిప్లై ఇచ్చింది. నేను ఒక నటిగా నాకు ఇచ్చిన పాత్రకి మాగ్జిమమ్ న్యాయం చేయడానికి ట్రై చేస్తానండి.. నేను ఎంచుకునే పాత్రలు నా ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేయాలనేదే నా తాపత్రయం.. కానీ అది పాత్రలు రాసే కథకలు, తెరపై చూపించే దర్శకులను పట్టి ఉంటుంది.. అని అనసూయ చెప్పుకొచ్చింది.

Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే

ఇప్పుడు అనసూయ అరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఇక పుష్ప ది రూల్ సినిమా షూటింగ్‌లోనూ అనసూయ పాల్గొనబోతోంది. దాక్షాయణి పాత్ర ఈ రెండో పార్ట్‌లో ఎలా ఉంటుందో చూడాలి. అసలే మొదటి పార్ట్‌లో అనసూయ పాత్ర మీద ఎంతగా ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. అనసూయ కట్టూబొట్టూ మీద విపరీతమైన నెగెటివ్ కామెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ రెండో పార్ట్‌లో అనసూయ ఏ రేంజ్‌లో కనిపిస్తుందో చూడాలి.

Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News