Ananya Nagalla Video : అందుకే నన్ను ఎవ్వడూ ట్రై చేయడం లేదేమో!.. బాధపడుతున్న అనన్య నాగళ్ల

Ananya Nagalla Love Story అనన్య నాగళ్ల ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ములేపేస్తోంది. తన అభిమానులతో చిట్ చాట్ చేస్తోంది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనన్య సమాధానం ఇస్తోంది. ఈ క్రమంలోనే ఆమె పర్సనల్ విషయాలను అడిగారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2023, 03:18 PM IST
  • నెట్టింట్లో అనన్య నాగళ్ల సందడి
  • లవర్ పేరు చెప్పమన్న నెటిజన్లు
  • అందుకే ట్రై చేయడం లేదన్న అనన్య
Ananya Nagalla Video : అందుకే నన్ను ఎవ్వడూ ట్రై చేయడం లేదేమో!.. బాధపడుతున్న అనన్య నాగళ్ల

Ananya Nagalla Boyfriend మల్లేశం సినిమాతో పరిచయమైన అనన్య నాగళ్ల.. వకీల్ సాబ్ సినిమాతో అదరగొట్టేసింది. పవన్ కళ్యాణ్‌ వకీల్ సాబ్ సినిమాలో కనిపిస్తే చాలనుకునే ఎంతో హీరోయిన్లకు రాని లక్కీ చానర్స్ అనన్యకు వచ్చింది. దీంతో అనన్య వకీల్ సాబ్ బ్యూటీగా క్రేజ్ దక్కించుకుంది. అప్పటి నుంచి అనన్య సోషల్ మీడియాలో రకరకాలుగా తన అందాలను ప్రదర్శిస్తోంది. ఇప్పుడు తాజాగా తన లవర్ గురించి, అన ప్రేమ వ్యవహారం మీద ఉన్న రూమర్ల గురించి స్పందించింది.

అనన్యకు రకరకాల ప్రశ్నలు ఎదురుకాగా.. అందులో కొందరు ఆమె మీదున్న ప్రేమను చూపించారు. ఇంకొందరు అయితే అనన్య జుట్ట మీద కన్నేశారు. హెయిర్ బాగుందని అందరూ సీక్రెట్‌ను అడిగారు. అలానే తన హెయిర్ సీక్రెట్ కూడా చెప్పింది. జుట్టుకి ఆయిల్ ఎక్కువగా పెట్టుకుంటాను అని తెలిపింది. ఇక అనన్య తన లవ్ రూమర్ల గురించి స్పందించింది. నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పేసేయ్.. అతని ఐడీ ఏంటో చెప్పు.. సీక్రెట్లన్నీ బయటపెట్టు అని అడిగాడు ఓ నెటిజన్.

బాయ్ ఫ్రెండ్‌.. అంత సీన్ లేదు భయ్యా.. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారని అనుకుంటున్నారు.. అందుకే ఎవ్వరూ ట్రై చేయడం లేదని అనుకుంటా.. అదే ప్రాబ్లమేమో అంటూ అనన్య నాగళ్ల నవ్వేసింది. అనన్య ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇక భీమిలి బీచ్‌లో అనన్య చేసిన హంగామా అందరికీ తెలిసిందే. అనన్య ఇప్పుడు తన అభిమానులతో పెట్టిన ముచ్చట్లు వైరల్ అవుతున్నాయి.

Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్

సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో అనన్యకు బాగానే తెలుసు. తన నాభి, ఎద అందాలను ఎలా ఎంత వరకు చూపించాలో చూపిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అనన్య నాగళ్ల. అనన్య అందాల విందు చేస్తే నెట్టింట్లో మంటలు చెలరేగాల్సిందే. అయితే తాజాగా అనన్య మాత్రం తన అభిమానులతో చేసిన చిట్ చాట్, అందులోని ముచ్చట్లు వైరల్ అవుతున్నాయి.

Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News