Ananya Ishaan Breakup: బాలీవుడ్ హీరోకు బ్రేకప్ చెప్పేసిన స్టార్ హీరోయిన్!

Ananya Ishaan Breakup: సినీ ఇండస్ట్రీలో ప్రేమకథలు సాధారణం. సినిమా షూటింగ్స్ లో ఏర్పడిన పరిచయాలు ఆ తర్వాత ప్రేమకు దారి తీస్తున్నాయి. అందులో కొన్ని ప్రయాణాలు తీరానికి చేరినా.. మరికొన్ని అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ పరిణామం బాలీవుడ్ లో జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న అనన్యా పాండే, ఇషాన్ ఖట్టర్.. ఇప్పుడు విడిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 08:11 AM IST
Ananya Ishaan Breakup: బాలీవుడ్ హీరోకు బ్రేకప్ చెప్పేసిన స్టార్ హీరోయిన్!

Ananya Ishaan Breakup: హీరోయిన్ అనన్యా పాండే అంటే తెలియని బాలీవుడ్ ప్రేక్షకుడు ఉండడు. ఎందుకంటే చిత్రసీమలో అడుగుపెట్టిన కొన్నేళ్లలోనే ఆమెకంటూ సరికొత్త స్టార్ డమ్ ను సంపాదించుకుంది. ఇప్పుడామె బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండడం సహా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన 'లైగర్' చిత్రంలో నటిస్తోంది. అయితే ఇప్పుడు అనన్యా పాండే గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

బాలీవుడ్‌ యువ నటుడు, షాహిద్‌ కపూర్ సోదరుడు ఇషాన్‌ కట్టర్‌తో అనన్య పాండే రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలం నుంచి రూమర్లు వస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి 'ఖాలీ పీలీ' అనే సినిమాలో కలిసి పని చేశారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని అప్పట్లో బాలీవుడ్ వర్గాలు కోడైకూశాయి. 

ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెళ్లడం సహా కలిసి ఫంక్షన్స్ కు హాజరవ్వడం జరిగింది. దీంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయినట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకర్ని ఒకరు అర్థం చేసుకొని ఈ బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Instant Bollywood (@instantbollywood)

'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ -2' చిత్రంతో వెండితెరకు పరిచయమైన అనన్యా పాండే.. ఆ తర్వాత 'పతీ పత్ని ఔర్ వో' సినిమాలో నటించింది. ఈ రెండు చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడడమే కాకుండా.. ఆమెకు ఫిల్మ్ ఫేర్, ఐఫా, జీ అవార్డ్స్ వరించాయి. ఆ తర్వాత 'ఖాలీ పీలీ', 'గెహరీయాన్' వంటి మూవీస్ లో నటించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'లైగర్'లోనూ నటించింది.   

Also Read: Raashi Khanna Comments: సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారాన్ని ఇకనైనా ఆపండి: రాశీఖన్నా

Also Read: 3 Years for Majili: నాగచైతన్యను మర్చిపోలేకపోతున్న సమంత.. ఇదిగో సాక్ష్యం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News