Baby 2nd Day Collections: బాక్సాఫీస్ వద్ద 'బేబీ' బీభత్సం.. రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే?

Baby Box Office Collections: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, యూట్యూబ్‌ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లో ఈమూవీ ఎంత వసూలు చేసిందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2023, 04:03 PM IST
Baby 2nd Day Collections: బాక్సాఫీస్ వద్ద 'బేబీ' బీభత్సం.. రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే?

Baby Movie 2nd Day Collections: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబీ. విరాజ్ అశ్విన్ ఓ కీలకపాత్రలో నటించాడు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 14న విడుదలైంది. తొలి రోజే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. 

అందుకు తగ్గట్టే తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఈ మూవీ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. తొలి రోజు 7 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకున్న బేబీ వరుసగా రెండో రోజు కూడా 7 కోట్లకి పైగానే గ్రాస్ ని వసూలు చేసింది. మెుత్తం మీద ఈ సినిమా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 14.3 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. తాజాగా ఈ విషయాన్ని బేబీ నిర్మాత ఎస్‌కేఎన్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘బేబీ సినిమాను అదరిస్తున్న ప్రేక్షకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఎస్‌కేఎన్‌. అంతేకాకుండా మూడో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయని.. ఈ రేంజ్ సక్సెస్ వస్తుందని ఊహించలేదని ప్రొడ్యూసర్‌ హర్షం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం తెలంగాణలో బోనాలు పండుగ నడుస్తుండటంతో ఈ సినిమా కలెక్షన్ల మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పోటీ ఇచ్చే తెలుగు సినిమాలు లేకపోవడంతో బేబీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. బేబీ మూవీకి విజయ్‌ బుల్గానిన్‌ అందించిన స్వరాలు, బీజీఎం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఆహా దక్కించుకుంది. సామజవరగమన తర్వాత తెలుగు ఇండ్రస్ట్రీకి బేబీ మంచి బూస్ట్ ఇచ్చే సినిమా అవుతుంది. 

Also Read: Abhishek Bachchan: పాలిటిక్స్ లోకి రాబోతున్న అభిషేక్​ బచ్చన్​? 2024 ఎన్నికల్లో ఆ స్థానం నుంచే పోటీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News