BiggBoss Sunny: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విజేత సన్నీకు భారీ కట్నాల ఆఫర్లు

BiggBoss Sunny: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విజేత సన్నీ క్రేజ్ పెరిగిపోతోంది. విజేతగా బయటికొచ్చాక సన్నీ ఫాలోయింగ్ మరీ పెరిగిపోయింది. ముఖ్యంగా అమ్మాయిల ఫోలోయింగ్ ఎక్కువైంది. ఇప్పుడు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 28, 2021, 02:40 PM IST
BiggBoss Sunny: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విజేత సన్నీకు భారీ కట్నాల ఆఫర్లు

BiggBoss Sunny: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విజేత సన్నీ క్రేజ్ పెరిగిపోతోంది. విజేతగా బయటికొచ్చాక సన్నీ ఫాలోయింగ్ మరీ పెరిగిపోయింది. ముఖ్యంగా అమ్మాయిల ఫోలోయింగ్ ఎక్కువైంది. ఇప్పుడు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విజేత సన్నీ అలియాస్ అరుణ్ రెడ్డి. సన్నీని బిఫోర్ బిగ్‌బాస్ ఆఫ్టర్ బిగ్‌బాస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సన్నీ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చినప్పుడు అతనిపై ఏవిధమైన అంచనాల్లేవు. బయటి ప్రపంచానికి కూడా పెద్దగా పరిచయం లేని వ్యక్తే. అంత పెద్ద సెలెబ్రిటీ కానే కాదు. అలాంటిది బిగ్‌బాస్‌లో (BiggBoss) పూర్తిగా తన ఆటతీరు, వ్యక్తిత్వం, ఎంటర్‌టైన్‌మెంట్‌తో అందరి మనసుల్ని గెల్చుకున్నాడు. ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో మరింతగా కీర్తి సాధించాడు. ముఖ్యంగా అమ్మాయిలు ఇప్పుడు సన్నీని తెగ ఫాలో అవుతున్నారు. స్నేహానికి అతనిచ్చే విలువేంటనేది  ప్రపంచమంతా చూసింది. అదే అతని స్థాయిని పెంచింది. 

ఇప్పుడు సన్నీకు (Sunny)పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. కుటుంబసభ్యులు సంబంధాలు చూస్తున్నారో తెలియదు గానీ, సోషల్ మీడియా సాక్షిగా సంబంధాలు ఎక్కువవుతున్నాయి. సన్నీకు తాజాగా అటువంటి అనుభవమే ఎదురైంది. అమెరికా నుంచి ఉష అనే ఓ మహిళ నేరుగా సన్నీకు వీడియో కాల్ చేసింది. తన కుమార్తె పెళ్లి చేసుకోమని ఆఫర్ చేసింది. కట్నం కింద ఏకంగా వంద కోట్లు ఇస్తానని చెప్పుకొచ్చింది. సన్నీని భరించాలంటే చాలా ఓర్పు ఉండాలి, మీరు ఆ మాట అన్నారు చాలు అంటూ సన్నీ సమాధానమిచ్చాడు. అయితే ఆ మహిళ అంతటితో ఆపకుండా..తాను సీరియస్‌గానే అడుగుతున్నానంటూ పెళ్లి సంబంధం గురించి మాట్లాడింది. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Also read: NBK - Ravi Teja: బాలకృష్ణ పాటకు స్టెప్పులేసిన రవితేజ.. అన్‌స్టాప‌బుల్‌ లేటెస్ట్ ప్రోమో అదుర్స్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News