త్వరలోనే ఆస్పత్రి నుంచి అమితాబ్, అభిషేక్ డిశ్ఛార్జ్

సూపర్ స్టార్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అభిమానులకు శుభవార్త. అమితాబ్, ఆయన తనయుడు హీరో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి వేగంగా కోలుకుంటున్నారు.

Last Updated : Jul 23, 2020, 01:01 PM IST
త్వరలోనే ఆస్పత్రి నుంచి అమితాబ్, అభిషేక్ డిశ్ఛార్జ్

బాలీవుడ్ సూపర్ స్టార్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అభిమానులకు శుభవార్త. అమితాబ్, ఆయన తనయుడు హీరో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి వేగంగా కోలుకుంటున్నారు. త్వరలోనే వీరిని ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ చేయనున్నట్లు  ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. అమితాబ్, అభిషేక్ - నటి ఐశ్వర్యరాయ్(Aishwarya Rai) దంపతులతో పాటు వీరి కూతురు ఆరాధ్య కరోనా బారిన పడటం తెలిసిందే. అమితాబ్ భార్య జయాబచ్చన్ ఒక్కరికే ఆ ఫ్యామిలిలో కరోనా నెగటివ్ వచ్చింది.  Photos: నితిన్, షాలినిల నిశ్చితార్థం ఫొటోలు

జులై 11న తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారని తొలుత 77 ఏళ్ల బిగ్ బి అమితాబ్ ప్రకటించారు. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తనకు కూడా కోవిడ్19 పాజిటివ్‌గా తేలిందని అభిషేక్ అదే రోజు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తనయుడు కూడా ఒకే ఆస్పత్రిలో కరోనా కష్ట కాలంలో తోడుగా వచ్చాడంటూ అమితాబ్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను, అభిమానులను కదిలించాయి. Rekha Suicide: యాంకర్, టీవీ నటి రేఖ ఆత్మహత్య

కొన్ని రోజులు ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉన్న ఐశ్వర్యరాయ్, చిన్నారి ఆరాధ్యకు కాస్త లక్షణాలు అధికం కావడంతో ఆసుపత్రిలో చేరారు. వీరు కూడా ఆస్పత్రిలో కోలుకుంటున్నారని తెలుస్తోంది. అభిమానుల ప్రార్థనలు ఫలించి అమితాబ్, అభిషేక్ కరోనా నుంచి కోలుకుని త్వరలోనే ఇంటికి వెళ్లిపోనున్నారని సన్నిహితులు చెబుతున్నారు. జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు  
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Trending News