Bigg Boss Telugu: ఇంకా కొద్దిరోజుల్లో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ కి చేరుకోనుంది. ప్రస్తుతం ఎనిమిది మంది హౌస్ మేట్స్ తో ఉన్న ఈ సీజన్.. త్వరలోనే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరో డిసైడ్ చేయనుంది. కాగా ఫినాలే దగ్గర పడుతూ ఉండడంతో హౌస్ మేట్స్ కూడా ఆటని చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఇక అప్పుడే టికెట్టు ఫినాలే టాస్కులు మొదలైపోయాయి. మంగళవారం నుంచి జరిగిన ఈ టాస్క్ లో అదరగొడుతున్నాడు హౌస్ మేట్స్.
ఇక బిగ్ బాస్ ఇస్తున్న ఈ ఫినాలే టాస్క్ లో అనేక గేములు ఆడుతూ దూసుకుపోతున్నారు. అయితే మంగళవారం ఈ రేస్ నుంచి శివాజీ, శోభా ఎలిమినేట్ అవ్వగా, బుధవారం ప్రియాంక కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇక గురువారం ఎపిసోడ్ మిగిలి ఉన్న కంటెస్టెంట్లతో కొత్త టాస్కులతో పోటీపోటీగా సాగింది.
ముందుగా క్రికెట్ గేమ్ టాస్క్ ఇవ్వగా ఇందులో అమర్ దీప్ చౌదరి ఫస్ట్ ప్లేస్ ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత అర్జున్.. ప్రశాంత్ లు రెండు మూడు స్థానాలలో నిలిచారు.
ఇక ఆ తరువాత బిగ్ బాస్ ‘తప్పింకుచో రాజా’ టాస్క్ ఇవ్వగా అందులో ప్రశాంత్ సూపర్ గా ఆడి మొదటి స్థానం సంపాదించుకున్నారు. రెండు మూడు స్థానాలలో అమర్ దీప్, యావర్ నిలిచారు. కానీ ఈ టాస్క్ లో అమర్ చేసిన పనికి యావర్ కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ టాస్క్ లో కాళ్ళకి చైన్ తో లాక్ వేసి ఉంటుంది. ఇక దానిని కీ ద్వారా వినిపించుకోవాలి. ప్రశాంత్, అమర్ ఒకరి తరువాత ఒకరు లాక్ తీసుకున్నారు. ఇక అమర్ లాక్ తీసుకోగానే ఆ కీ ని అసలు అర్థం కాని పరిస్థితిలో పడేయడంతో యవర్ కి చాలా కష్టమైపోయింది.
దీంతో యావర్ తక్కువ మార్కులతో రేస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తన దగ్గరున్న పాయింట్స్ ని అమర్ పైన కోపంతో ప్రశాంత్ కి ఇచ్చేశారు యావర్.
ఇక ఇప్పుడు ‘టికెట్ టూ ఫినాలే’ రేసులో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, అర్జున్, గౌతమ్ ఉన్నారు.
అయితే వీళ్ళ నలుగురులో ఎక్కువ ఛాన్స్ అమర్ దీప్ కైనా లేదా ప్రశాంత్ కైనా ఉన్నట్టు అర్థమవుతుంది. వీరిద్దరూ గట్టిగా ఆడుతూ అందరికీ పోటీ ఇస్తున్నారు.
ఈరోజు టాస్క్ లతో మొదటి ఫైనలిస్ట్ ఎవరు అన్నది తేలిపోతుంది. మొత్తానికి వీరిద్దరూ ఫైనలిస్ట్ రేస్ కి అడుగు దూరంలో ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్ విషయానికి వస్తే.. ఈవారం నామినేషన్స్ లో శివాజీ, గౌతమ్, అర్జున్, ప్రియాంక, శోభా శెట్టి యావర్, ప్రశాంత్ నిలిచారు. ఇక వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలి అంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook