Pushpa In OTT: ఎల్లుండి నుండే అమెజాన్ ప్రైమ్‏లో 'పుష్ప'.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

ఈ నెల 7న పుష్ప సినిమా ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అవుతుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2022, 01:53 PM IST
  • డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు పుష్ప
  • ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న పుష్ప
  • పుష్ప అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన మేకర్స్
Pushpa In OTT: ఎల్లుండి నుండే అమెజాన్ ప్రైమ్‏లో 'పుష్ప'.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

Amazon Prime Video To Announce Pushpa OTT Release Date: స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar) కాంబినేషనల్‌లో వచ్చిన సినిమా 'పుష్ప: ది రైజ్‌' (Pushpa ). 2021 డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్‌ ఇండియా సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా హిందీలో అంచనాలను మించి కలెక్షన్లు రాబడుతోంది. పుష్ప రిలీజై ఇప్పటికి 20 రోజులు గడుస్తున్నా.. కలెక్షన్ల సునామి మాత్రం అగడం లేదు. దాంతో బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

తాజాగా పుష్ప చిత్ర యూనిట్ అల్లు అర్జున్‌ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 7న పుష్ప సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ (Pushpa OTT Release Date) అవుతుందని అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)‏లో పుష్ప సినిమా స్ట్రీమింగ్ కానుంది. దాంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అమెజాన్ ప్రైమ్‏లో సినిమా చూసేందుకు అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా ఓటీటీలో కూడా రికార్డ్స్ సృంటించనుంది.

Also Read: Sana Ganguly Covid 19: సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్.. సనా గంగూలీకి పాజిటివ్! ఆందోళనలో దాదా ఫ్యామిలీ!

నిజానికి జనవరి 7న ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన పాన్‌ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. దాంతో ఆర్ఆర్ఆర్ విడుదల కావాల్సిన తేదీనే 'పుష్ప' సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని సోషల్ మీడియాలో ఇటీవల టాక్ వచ్చింది. అదే వార్తలను పుష్ప చిత్రబృందం నిజం చేసింది. 

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సుకుమార్‌ తెరకెక్కించిన 'పుష్ప'లో అల్లు అర్జున్‌ 'పుష్ప రాజ్‌'గా నటించారు. ఇప్పటివరకూ ఎన్నడూ చూడని విధంగా బన్నీని ఊరమాస్‌ యాంగిల్‌లో సుక్కు చూపించారు. చిత్తూరు యాసలో 'తగ్గేదే లే' అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. నిజం చెప్పాలంటే అల్లు అర్జున్‌ తన నటనతో వన్‌ మ్యాన్‌ షో చేశాడనే చెప్పాలి. ఇక శ్రీవల్లి పాత్రలో స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) తనదైన శైలిలో నటించారు. సునీల్, అనసూయ (Anasuya) కూడా ఆకట్టుకున్నారు. రాక్‌ స్టార్‌ దేవిశ్రీ (DSP) సంగీతం సినిమాకు ప్లస్ అయింది. 

Aslo Read: Same Sex Marriage: పెళ్లితో ఒక్కటి కానున్న ఇద్దరు మహిళా వైద్యులు... సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News