HBD Allu Arjun: మీ వల్లే నాకు ఈ స్థాయి.. బర్త్​ డే సందర్భంగా అల్లు అర్జున్​ పోస్ట్​

HBD Allu Arjun: కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, గురువుల ఆశీర్వాదాల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఆయన 40వ పుట్టిన రోజు సందర్భంగా పెట్టిన ట్విట్టర్​ పోస్ట్​లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2022, 07:56 PM IST
  • అభిమానులకు అల్లు అర్జున్ థ్యాంక్స్​
  • బర్త్​డే విశేష్​ చెప్పిన వారందరికి కృతజ్ఞతలు
  • 40 ఏళ్లలో వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో అనుభూతులంటూ ట్వీట్​..
HBD Allu Arjun: మీ వల్లే నాకు ఈ స్థాయి.. బర్త్​ డే సందర్భంగా అల్లు అర్జున్​ పోస్ట్​

HBD Allu Arjun: ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. ఎప్పుడు తనను ప్రోత్సహిస్తూ, అండగా నిలిచిన వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ట్వీట్​ చేశారు.

అల్లు అర్జున్​ నేడు 40వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్​ మీడియాలో హల్​ చల్ చేశారు. ట్విట్టర్​లో ఏకంగా హ్యాపి బర్త్​డే అనే హ్యాష్​ ట్యాక్​ ట్రెండ్​ అయ్యింది. ఈ స్థాయిలో తనకు బర్త్​డే విశేస్​ చెప్పినవారికి ప్రత్యేక కృతజ్ఞతలు చప్పారు.

'నా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్​, గురువులు, శ్రేయోభిలాషులతోపాటు.. ప్రియమైన అభిమానులకు ధన్యవాదాలు. నేడు ఈ స్థాయిలో ఉన్ననంటే అందుకు మీ ఆశిశ్సులు, సపోర్టే కారణం. నేటితే నేను 40 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఏదే తెలియని ఆప్యాయత. ఇంత మంది ఆదర, అభిమానాలు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరి థ్యాక్స్​.' అంటూ ఓ ట్వీట్​ చేశారు.

అల్లు అర్జున్ గురించి..

ప్రముఖ సనీ నిర్మాత అల్లు అరవింద్​ రెండో కుమారుడే అల్లు అర్జున్​. బాల నటుడిగా మెప్పించి.. గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్రతీ సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల వచ్చి పుష్ప మూవీ పాన్ ఇండియా లెవల్లో హిట్​ టాక్ తెచ్చుకుని.. స్టైలీష్​ స్టార్ అల్లు అర్జున్​ను.. ఐకాన్​ స్టార్​గా మార్చింది.

Also read: Akira Nandan: పవర్ స్టార్ కొడుకా.. మజాకా.. అకీరా నందన్ పవర్‌ఫుల్ బాక్సింగ్ వీడియో...

Also read: Yami Gautam: ఇప్పటివరకూ మీ పోర్టల్‌ని ఫాలో అయ్యేదాన్ని.. ఇకపై కాను! రివ్యూపై యామీ గౌతమ్ ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News