Allu Arjun: పుష్ప 2 కంటే ముందే సెట్స్ కు బన్నీ.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ప్రాజెక్ట్!

Allu Arjun shoots for an Ad with Trivikram: త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ ఒక యాడ్ ఫిలిం చేస్తున్నారు. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 26, 2022, 04:36 PM IST
  • త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ
  • యాడ్ షూట్ కోసం బన్నీ
  • వైరల్ అవుతున్న ఫోటోలు
Allu Arjun: పుష్ప 2 కంటే ముందే సెట్స్ కు బన్నీ.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ప్రాజెక్ట్!

Allu Arjun shoots for an Ad with Trivikram: అల్లు అర్జున్ ఎక్కడా తగ్గేదిలే అంటూ దూసుకుపోతున్నాడు. గత ఏడాది పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో సూపర్ క్రేజ్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతానికి ఆయన ఇప్పటికే కొన్ని యాడ్ ఫిలిమ్స్ చేశారు. అలాగే కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అల్లు అర్జున్ క్రేజ్ దృష్ట్యా ఇప్పుడు ఆయనతో అనేక సంస్థలు పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

అలాగే తమ తమ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడానికి ఆయనను సంప్రదిస్తున్నారు. తాజాగా అయినా ఒక బ్రాండ్ కి అంబాసిడర్గా సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ బ్రాండ్ కి సంబంధించిన యాడ్ ఫిలిం షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ యాడ్ ఫిలిం షూటింగ్లో అల్లు అర్జున్ పాల్గొన్నట్లు సమాచారం. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పుష్ప సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆ సినిమా సీక్వెల్ మీద ప్రస్తుతం దృష్టి పెట్టారు మేకర్స్. దర్శకుడు సుకుమార్ ఒకపక్క స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండగా మరో టీం మాత్రం సినిమా లొకేషన్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించబోతోంది. రెండో భాగాన్ని గ్రాండ్ గా ప్లాన్ చేయాలని భావిస్తున్న సినిమా యూనిట్ బడ్జెట్ పెంచడమే కాక సినిమా స్క్రిప్ట్ లో కూడా అనేక మార్పులు చేర్పులు చేసినట్లు చెబుతున్నారు. ఇక అల్లు అర్జున్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

Also Read: Pawan Kalyan: పవన్ రాజకీయాల దెబ్బకు టెన్షన్లో డైరెక్టర్స్.. ఫైనల్లీ గుడ్ న్యూస్!

Also Read:Nandamuri Balakrishna: బాలకృష్ణ వీడియోలు బయటకు.. బాబు బంగారం అంటూ పండుగ చేసుకుంటున్న ఫాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News