Arha, Pooja Hegde dance : అల్లు అర్హతో పూజా హెగ్డే డ్యాన్స్.. ఆ పాటకు తామే స్టెప్స్‌ కనిపెట్టామన్న పూజా!

Allu Arjun daughter Arha dancing with Pooja Hegde: అల వైకుంఠపురములో మూవీలోని పాటకు డ్యాన్స్ చేసిన పూజా హెగ్డే, అల్లు అర్హ. అల వైకుంఠపురములో మూవీ వచ్చి రెండేళ్లు అయిన సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన హీరోయిన్ పూజా హెగ్డే. వైరల్ అవుతోన్న వీడియో.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 08:55 PM IST
  • అల వైకుంఠపురములో మూవీ వచ్చి రెండేళ్లు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో హీరోయిన్ పూజా హెగ్డే పోస్ట్

    అర్హతో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్
Arha, Pooja Hegde dance : అల్లు అర్హతో పూజా హెగ్డే డ్యాన్స్.. ఆ పాటకు తామే స్టెప్స్‌ కనిపెట్టామన్న పూజా!

Allu Arjun daughter Arha dancing with Pooja Hegde video goes viral : అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) మూవీ రిలీజై రెండేళ్లు అవుతోంది. అల్లు అర్జున్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది అల వైకుంఠపురములో. త్రివిక్ర‌మ్ (Trivikram) డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ పూజా హెగ్డే రేంజ్‌ని మ‌రింత‌ పెంచింది. ఈ సినిమాతో పూజాహెగ్డే వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.

ఇక అల వైకుంఠపురములో మూవీ చాలా రికార్డులు (Records) క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ (Box office) వద్ద ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది.. అలాగే ఈ సినిమా పాటలు కూడా యూట్యూబ్‌లో (YouTube) రికార్డుల మోత మోగించాయి. అంతటా అల వైకుంఠపురములో మ్యూజికే (Ala Vaikunthapurramuloo Music) మోగి పోయింది.

బుట్టబొమ్మ, రాములో రాముల సాంగ్‌లకు (Ramuloo Ramulaa song) సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఈ పాటలపై రీల్ వీడియోలతో పాటు ఇతర వీడియోలు చాలా వచ్చాయి. 

అయితే తాజాగా అల వైకుంఠపురములో మూవీ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసింది. అల వైకుంఠపురములో తాను అల్లు అర్జున్‌తో కలిసి చేసిన డ్యాన్స్‌ని చూశారు కదా.. ఇక ఇప్పుడు ఈ డ్యాన్స్ కూడా చూడండి అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది పూజా హెగ్డే. 

అల వైకుంఠపురములో షూటింగ్‌లో షాట్‌కు ముందు గ్యాప్‌లో అర్హతో డ్యాన్స్ (Arha dance) చేసింది ఈ భామ. మాకు తెలియకుండానే.. బుట్టబొమ్మ స్టెప్పులను ఇద్దరమూ ముందే కనిపెట్టేశాం అంటూ పూజా హెగ్డే పేర్కొంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)

 

Also Read : Dimple Hayathi Photos: ఈ తెలుగమ్మాయిని చూస్తే అందమే అసూయ పడుతుందేమో!

ఇక వీడియోలో అలా వైకుంఠపురంలో మూవీలోని రాములో రాములా పాటకు పూజా హెగ్డే, అల్లు అర్హ డ్యాన్స్ (Allu Arha dance) చేస్తూ కనిపించారు. మేకప్ రూమ్‌లో పూజా హెగ్డే (Pooja Hegde) మేకప్ చేసుకొంటూనే అర్హతో (Allu Arha) కలిసి స్టెప్పులు వేసింది. ఇద్దరూ పాటకు లయబద్దంగా స్టెప్పులేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read : Naga Chaitanya: సమంతతో విడాకులపై నాగ చైతన్య తొలి స్పందన- ఏమన్నారంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News