Pushpa The Rule Teaser : మూడు నిమిషాల టీజర్?.. బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Pushpa The Rule Action Teaser పుష్ప ది రూల్ నుంచి మూడు నిమిషాల యాక్షన్ టీజర్ రాబోతోందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. బన్నీ బర్త్ డేకు అదిరిపోయే సర్ ప్రైజ్‌ను సుకుమార్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2023, 12:36 PM IST
  • అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్
  • ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వబోతోన్న బన్నీ
  • మూడు నిమిషాల పుష్ప టీజర్
Pushpa The Rule Teaser : మూడు నిమిషాల టీజర్?.. బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Pushpa The Rule Action Teaser అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) నాడు ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇవ్వబోతోన్నట్టుగా కనిపిస్తోంది. పుష్ప ది రూల్‌ నుంచి మూడు నిమిషాల యాక్షన్ టీజర్ రాబోతోందని సమాచారం అందుతోంది. పుష్ప మొదటి పార్ట్ సమయంలోనూ ఇలానే ఓ యాక్షన్ గ్లింప్స్‌ను వదిలిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది.

పుష్ప చిత్రం వచ్చి ఇప్పటికే ఎన్ని రోజులు అయిందో అందరికీ తెలిసిందే. ఏడాదికి పైగా అయినా ఇంత వరకు సీక్వెల్ మీద ఎలాంటి అప్డేట్ రాలేదు. మొదటి పార్ట్ అనుకోనంతగా హిట్ అవ్వడం, పాన్ ఇండియన్ క్రేజ్ రావడంతో సీక్వెల్‌లో కీలక మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తోంది. మరింత పవర్ ఫుల్‌గా స్క్రిప్ట్‌ను సుకుమార్ రెడీ చేసినట్టు అనిపిస్తోంది.

అందుకే సినిమా షూటింగ్‌ను ఇంత ఆలస్యంగా మొదలెట్టేశారు. సినిమా షూటింగ్ ఆల్రెడీ జరుగుతోంది. అయితే ఇప్పుడు బన్నీ బర్త్ డే సందర్భంగా ఓ సర్ ప్రైజ్ ఇవ్వబోతోన్నారట. పుష్ప మొదటి పార్ట్ సమయంలో ఓ వీడియో గ్లింప్స్‌ను వదిలారు. అందులో బన్నీ చేసిన యాక్షన్ సీక్వెన్స్, దేవీ శ్రీ ప్రసాద్ బీజీఎం, సుకుమార్ టేకింగ్ చూసి అంతా షాక్ అయ్యారు.

ఇప్పుడు కూడా అలాంటి ఓ విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేస్తారట. ఇందులో కూడా ఎలాంటి మాటలు ఉండవని, కేవలం యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్ షాట్స్ మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. అన్ని భాషలకు రీచ్ అవ్వాలని, ఇది ఇప్పుడు ఇండియా దాటి వినిపించాలనే ఉద్దేశంలో ఇలా ప్లాన్ చేసినట్టు సమాచారాం.

ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయట. అయితే ఆ మధ్య దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఆల్రెడీ మూడు పాటలు కంపోజ్ చేశానని అన్నాడు. కానీ ఈ మధ్య మాత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవలె మొదలయ్యాయని వార్తలు వచ్చాయి. మొత్తానికి ఈ సారి కూడా పుష్ప ది రూల్ పాటలు ట్రెండ్ అవుతాయా? లేదా? అన్నది చూడాలి.

Also Read:  Deepthi Sunaina : బ్లాక్ చేశాడంటూ ఎమోషనల్.. వేడుకుంటోన్న దీప్తి సునయన

Also Read: Niharika Konidela Divorce : ఈ ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయని చైతన్య.. నిహారికతో విడాకులు కన్ఫామ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News