Ugram Movie Teaser : నరేష్ 'ఉగ్ర'రూపం.. నెవ్వర్ బిఫోర్.. బూతు డైలాగ్‌తో టీజర్

Ugram Movie Teaser Out అల్లరి నరేష్ అంటే కేవలం కమెడియన్ హీరోగా అనుకున్నారంతా. కానీ నాంది సినిమాతో సీరియస్ రోల్‌లోనూ మెప్పించగలడని అందరికీ తెలిసింది. మహర్షి సినిమాలోనూ సపోర్టివ్ రోల్ చేశాడు. ఇక ఇప్పుడు అయితే బూతు డైలాగ్‌లతో ఉగ్రం టీజర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2023, 01:12 PM IST
  • నరేష్ ఉగ్రం టీజర్ విడుదల
  • ఉగ్రరూపం చూపించిన హీరో
  • ఈ సారి కూడా వర్కౌట్ అయినట్టేనా?
Ugram Movie Teaser : నరేష్ 'ఉగ్ర'రూపం.. నెవ్వర్ బిఫోర్.. బూతు డైలాగ్‌తో టీజర్

Allari Naresh Ugram Movie Teaser నాంది సినిమాతో డైరెక్టర్‌గా విజయ్ కనకమేడలకు, హీరోగా నరేష్‌ కొత్త ఇమేజ్ వచ్చింది. అయితే ఈ ఇద్దరూ మళ్లీ ఉగ్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ వచ్చింది. ఇందులో నరేష్ తన కొత్త అవతరాన్ని చూపించాడు. ఎంతో ఇంటెన్స్ ఉన్న యాక్షన్ రోల్‌ను చేశాడు. పోలీస్ ఆఫీసర్‌గా నరేష్ ఉగ్రరూపంతో కనిపించాడు. ఇక టీజర్ చివర్లో బూతు డైలాగ్‌తో ఆశ్చర్యపరిచాడు.

అయితే ఈ మూవీ టీజర్ చూస్తుంటే మాత్రం ఇదొక రివేంజ్ డ్రామాలా కనిపిస్తోంది. పోలీస్ ఆఫీసర్ విలన్లను ఎదురించడం.. విలన్లేమో హీరో ఫ్యామిలీని టచ్ చేయడం.. భార్యనో పాపనో చంపడం.. ఆ తరువాత హీరో మళ్లీ పగ తీర్చుకోవడం అనే కాన్సెప్టుతోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఇలాంటి సీరియస్ రోల్, ఇంటెన్స్ యాక్షన్ చేయడం మాత్రం నరేష్‌కు కొత్త. అలా అతడ్ని చూడటం మనకూ కొత్తే.

అందుకే ఈ ఉగ్రం కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే విజయ్ కనకమేడల మాత్రం టీజర్‌ను ఇలా కట్ చేయడంలోనూ స్ట్రాటజీ మెయింటైన్ చేసినట్టుగా కనిపిస్తోంది. అసలు కథను రివీల్ చేయకుండా ఇలా టీజర్‌ను కట్ చేసినట్టుగా అనిపిస్తోంది. నరేష్ మాత్రం ఇప్పుడు ఫుల్లుగా సీరియస్ రోల్స్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News