Akkineni Akhil: అప్పుడేమో తోపు, తురుం అని ఇప్పుడు కనీసం పేరు కూడా తీయలేదుగా!

 Akkineni Akhil Thanks Giving Note: అక్కినేని అఖిల్ హీరోగా ఈ మధ్యకాలంలో తెరకెక్కిన సినిమా ఏజెంట్ ఏప్రిల్ 28వ తేదీన విడుదలై దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకోగా అక్కినేని క్\అఖిల్ రాసిన లేఖ కలకలం రేపుతోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 15, 2023, 08:35 PM IST
Akkineni Akhil: అప్పుడేమో తోపు, తురుం అని ఇప్పుడు కనీసం పేరు కూడా తీయలేదుగా!

Akkineni Akhil Ignores Director Surendar Reddy: అక్కినేని అఖిల్ హీరోగా ఈ మధ్యకాలంలో తెరకెక్కిన సినిమా ఏజెంట్. ఏప్రిల్ 28వ తేదీన విడుదలైన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. అఖిల్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా మమ్ముట్టి కీలకపాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాని అఖిల్ కెరీర్ లోనే మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీగా తెలుగు సహా తమిళ, కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

కానీ ఏప్రిల్ 28వ తేదీన మాత్రం కేవలం తెలుగు వర్షన్ ఒక్కటే రిలీజ్ అయింది. దీని రిజల్ట్ ని బట్టి వేరే భాషల్లో తర్వాత రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పటి వరకు ఈ విషయం మీద చాలా మౌనం పాటిస్తూ వచ్చిన అక్కినేని అఖిల్ తాజాగా ఈ సినిమా గురించి ఒక లేఖ విడుదల చేశారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులకు అని చెబుతూ రాసిన లేఖలో ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు ఇతర టెక్నీషియన్లు అందరికీ సిన్సియర్గా థాంక్స్ చెబుతున్నామని చెప్పుకొచ్చారు.

Also Read: Samantha No.1: డిజాస్టర్లు వచ్చినా తగ్గేదేలే.. సమంత ఇంకా నెంబర్.1ఏ!

ఈ సినిమాని ఒక పూర్తి స్థాయిలో రూపొందించేందుకు వారు తమ జీవితంలో కొంత భాగాన్ని త్యాగం చేశారని మేము ఈ సినిమాని ఎంతో ప్రాణం పెట్టి చేశాము ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవ్వలేకపోయిందని మేము మీకు ఒక మంచి సినిమా ఇవ్వలేకపోయామని అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా నిర్మాత అనిల్ గారికి థాంక్స్ చెప్పిన ఆయన తనకు ముందు నుంచి బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టంగా నిలబడ్డారని చెప్పుకొచ్చారు. ఇక తన మీద సినిమా మీద నమ్మకం ఉంచిన డిస్ట్రిబ్యూటర్లకు మీడియాకి కూడా థాంక్స్ చెప్పాడు అఖిల్.

మీరిచ్చే ప్రేమ ఎనర్జీ మాత్రమే ఇలాంటి డిజాస్టర్లు వచ్చినా తను మరింత ముందుకు వెళ్లేలా చేస్తాయని తన హృదయం లోతుల నుంచి అభిమానులందరికీ తన శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని చెప్పుకొచ్చాడు. ఇక నన్ను నమ్మిన వారందరి కోసం మరింత బలంగా ముందుకు వస్తానంటూ అఖిల్ పేర్కొన్నాడు. అయితే పేరుపేరునా అందరినీ ప్రస్తావించిన అఖిల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి విషయంలో మాత్రం మౌనం పాటించడం హాట్ టాపిక్ అవుతుంది.

సినిమా రిలీజ్ కంటే ముందు డైరెక్టర్ తోపు తురుము అని పొగుడుతారు కానీ సినిమా రిలీజ్ అయ్యి ఒకవేళ తేడా పడితే గనుక అన్ని డైరెక్టర్ వల్లే అన్నట్లుగా ఆయన మీద తోసేస్తారంటూ సురేందర్ రెడ్డి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో నిర్మాత అనిల్ సుంకర కూడా తాము బౌండెడ్ స్క్రిప్ట్ తో ముందుకు వెళ్ళకపోవడం వల్ల పొరపాటు జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అఖిల్ కూడా డైరెక్టర్ పేరు ఏ మాత్రం ప్రస్తావించకుండా తప్పంతా అతనిదే అన్నట్టు మిగతా వారందరికీ థాంక్స్ చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది.

Also Read: Prabhas No.1: టాలీవుడ్ నెంబర్ 1 ప్రభాసే.. ఏప్రిల్ లో కూడా తగ్గని రెబల్ స్టార్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News