Aishwarya Rai Daughter : కోర్టు మెట్లెక్కిన ఆరాధ్య బచ్చన్.. ఐశ్వర్య కూతురు విషయంలో జరిగిందిదే

Trolls on Aaradhya Bachchan ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ మీద సోషల్ మీడియాలో పిచ్చి వార్తలు కనిపిస్తుంటాయి. ఆమె ఎప్పుడైన బయట కనిపించినా ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆమెకు ఆరోగ్యం బాగా లేదని ఇలా రకరకాలుగా యూట్యూబ్‌లో థంబ్ నెయిల్స్ కనిపిస్తుంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2023, 12:33 PM IST
  • సోషల్ మీడియాలో హద్దులు దాటుతున్న ట్రోల్స్
  • ఐశ్వర్య రాయ్ కూతురి మీద దారుణమైన వార్తలు
  • ట్రోలింగ్ మీద కోర్టు మెట్లెక్కిన బచ్చన్ ఫ్యామిలీ
Aishwarya Rai Daughter : కోర్టు మెట్లెక్కిన ఆరాధ్య బచ్చన్.. ఐశ్వర్య కూతురు విషయంలో జరిగిందిదే

Aaradhya Bachchan Youtube Thumbnail సోషల్ మీడియాలో హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతల మీద ట్రోలింగ్ జరుగుతుంది. ఈ ట్రోలింగ్ విషయంలో హీరో హీరోయిన్ల ముందు వరసలో ఉంటారు. ఇంకా డెప్త్‌గా వెళ్తే.. హీరోయిన్ల మీదే ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంటుంది. వారు మాట్లాడే మాటలు, వేసుకునే బట్టల నుంచి మొదలు ప్రతీ ఒక్క అంశం మీద ట్రోలింగ్ వస్తుంటుంది. అయితే తమ వరకు ట్రోలింగ్ జరిగితే అంతగా పట్టించుకోని సెలెబ్రిటీలు ఫ్యామిలీ మీద ట్రోలింగ్ జరిగితే మాత్రం సీరియస్‌ అవుతుంటారు.

ఇప్పుడు అభిషేక్, ఐశ్వర్యలు కూడా అదే స్థితిలో ఉన్నారు. తన మీద ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లు చేసినా ఓకే అని, ఏమైనా ఉంటే తనను అనండని, దమ్ముంటే ముందుకు వచ్చి అనండి అంటూ ఇది వరకే ట్రోలర్లకు కౌంటర్లు వేశాడు అభిషేక్ బచ్చన్. కానీ తన పాప మీద వచ్చే నెగెటివ్ కామెంట్లను మాత్రం సహించడం లేదు. అందుకే తన పాప గురించి చెడుగా రాసే యూట్యూబ్ చానెళ్ల మీద అభిషేక్ కేస్ వేశాడు.

ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యం మీద ఎప్పుడూ ఏదో ఒక పిచ్చి వార్త, థంబ్ నెయిల్స్‌తో రెచ్చిపోతోంటారు ఆకతాయిలు. అలాంటి వారిని క్షమించేది లేదని అభిషేక్ బచ్చన్ ఇది వరకే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసును విచారణకు వచ్చింది. అందుకే ఆరాధ్య ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కినట్టు తెలుస్తోంది. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడంపై నేడు విచారణ జరగనుంది. న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది..వారికి ఎలాంటి శిక్షను విధిస్తుందన్నది చూడాలి.

Also Read:  IT Raids on Mythri : మైత్రీ కార్యాలయంలో రెండో రోజూ ఐటీ దాడులు.. వందల కోట్లపై ఆరా

సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్‌ పట్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధపడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లు ఎక్కువగా వస్తుంటాయి. కొంత మంది వాటిని సీరియస్‌గా తీసుకుంటారు. కేసులు పెడుతుంటారు. ఇంకొందరు వాటిని లైట్ తీసుకుంటారు. అయితే ఇలా సెలెబ్రిటీల పిల్లల మీద మాత్రం ట్రోలింగ్ చేయడం హర్షించదగ్గ విషయం కాదు.

Also Read: Mrunal Thakur : 'సీత'ను రొమాంటిక్‌గానే చూడాలనుకుంటున్నారా?.. నెటిజన్ల కోరిక ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News