Sushant singh Rajput: హత్యనా..ఆత్మహత్యనా? తుది నివేదికలో అదే ఉందా?

సంచలనం రేపుతున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించిన కీలక నివేదిక వెలువడింది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ నివేదికను కేంద్రానికి సమర్పించింది. 

Last Updated : Sep 29, 2020, 01:33 PM IST
Sushant singh Rajput: హత్యనా..ఆత్మహత్యనా?  తుది నివేదికలో అదే ఉందా?

సంచలనం రేపుతున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Bollywood Actor Sushant singh rajput ) మరణానికి సంబంధించిన కీలక నివేదిక వెలువడింది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( AIIMS ) ఈ నివేదికను కేంద్రానికి సమర్పించింది. 

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. సుశాంత్ ది ఆత్మహత్య కాదు..హత్యేనని ఓ వర్గం వాదిస్తోంది. మరోవైపు సుశాంత్ కేసు విచారణ సందర్బంగా  బయటపడిన కీలక విషయాలు ముంబై డ్రగ్స్ కేసు ( Mumbai Drugs case ) గా మారిపోయాయి. ఓ వైపు ఈడీ, సీబీఐలు మరోవైపు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( Narcotics control bureau ) లు విచారణ సాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  మరణంపై సుదీర్ఘ కాలంగా పరిశీలన జరిపిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కీలకమైన తుది నివేదికను ( AIIMS Report on Sushant death ) ప్రభుత్వానికి సమర్పించింది. 

ఈ నివేదిక ప్రకారం సుశాంత్ మృతదేహంలో ఎలాంటి విషం లేదని ఎయిమ్స్ స్పష్టం చేసింది. ఉరి వేసుకోవడమే మృతికి కారణమని ఎయిమ్స్ వర్గాలు ధృవీకరించాయి. సుశాంత్ డీఎన్ఏను  పూర్తిగా పరిశీలించిన అనంతరమే నివేదికను సమర్పిస్తున్నామని, దీనిలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని పేర్కొన్నారు. గతంలో మహారాష్ట్ర వైద్యుల నివేదికలో తేలిన విషయాలే తమ పరిశీలనలో తేలాయని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. తాజా నివేదిక ఆధారంగా మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు.

జూన్ 14వ తేదీన ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ( Sushant singh rajput suicide ) కు పాల్పడిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. గొంతు నులిమి చంపి ఉంటారని..హత్యేనని సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకే ఈ కేసు దర్యాప్తును ఈడీ, సీబీఐలు చేపట్టాయి. డ్రగ్స్ కోణం బయటపడటంతో ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలో దిగింది. ఇప్పుడు సీబీఐ దర్యాప్తులో భాగంగా ఎయిమ్స్ నివేదిక ప్రభుత్వానికి అందింది. Also read: Pawan Kalyan's role in PSPK28: పవన్ కల్యాణ్ పాత్రపై ఇంట్రెస్టింగ్ టాక్

Trending News