Vijay Devarakonda- Rashmika: రష్మికతో బ్రేకప్..సమంతతో టైం పాస్ లవ్.. విజయ్ దేవరకొండపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉమైర్

Vijay Devarakonda-Samantha Love Affair: రష్మికతో బ్రేకప్ అయిన తరువాత సమంతతో విజయ్ దేవరకొండ ప్రేమలో పడ్డారని అయితే అది టైం పాస్ లవ్ అని ఉమైర్ సంధూ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 14, 2023, 07:10 PM IST
Vijay Devarakonda- Rashmika: రష్మికతో బ్రేకప్..సమంతతో టైం పాస్ లవ్.. విజయ్ దేవరకొండపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉమైర్

Vijay Devarakonda Breakup with Rashmika in Relationship with Samantha: దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిని అని చెప్పుకునే ఉమైర్ సంధు చేస్తున్న ఆరోపణలు టాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హీరో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ వంటి వారి గురించి కామెంట్లు చేసిన ఆయన ఇప్పుడు కొత్తగా విజయ్ దేవరకొండ మీద కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి విజయ్ దేవరకొండకు రష్మిక మందన మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని వారిద్దరూ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు ఉమైర్ సంధు చెబుతున్న దాని ప్రకారం విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇద్దరికీ బ్రేకప్ అయిందట.

అలా బ్రేకప్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ, సమంత రుతు ప్రభు ప్రేమలో పడినట్లు ఉమైర్ సంధు కామెంట్ చేశాడు. సమంత గతంలో నాగచైతన్యను వివాహం చేసుకుని సుమారు నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత విడాకులు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక తర్వాత నాగచైతన్య సమంత కలుస్తారంటూ కూడా కొంత ప్రచారం జరిగినా అదేమీ నిజం కాలేదు. ఖుషీ  సినిమా కోసం విజయ్ దేవరకొండ సమంత ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ ఖుషి సినిమా తెరకెక్కుతోంది.

కాశ్మీర్ నేపద్యంలో సాగుతున్న ఈ ప్రేమ కథకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. అయితే కాశ్మీర్ షెడ్యూల్లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ఒకరోజు ఒకే గదిలో కూడా గడిపారని ఉమైర్ సంధు సంచలన ఆరోపణలు చేశాడు. ఇక అతను చేస్తున్న వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున హీరోల అభిమానులు ఫైర్ అవుతూ కామెంట్ చేస్తున్న నేపథ్యంలో తనకు ఈ నటీనటుల సీక్రెట్ న్యూస్ వారి పర్సనల్ స్టాఫ్ నుంచి వస్తుందని పేర్కొన్నారు.

వారి హెయిర్ డ్రస్సర్స్, మేకప్ ఆర్టిస్టులు, స్టైలిష్లులు, సెక్యూరిటీ బౌన్సర్లు, డ్రైవర్లు, క్లోజ్ పిఆర్ నుంచి ఈ విషయాలు తనకు తెలుస్తాయని ఈ విషయంలో తన తప్పేమీ లేదన్నట్లుగా ఆయన కవర్ చేసుకునే కామెంట్ చేశాడు. ఇక విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ ఈ మధ్యనే మళ్లీ మొదలైంది. చాలా కాలం పాటు మయోసైటిస్తో ఇబ్బంది పడిన సమంత ఈ మధ్యనే తిరిగి షూటింగ్ కి వచ్చింది.

Also Read: Priya Vadlamani Photos: ప్యాంట్ మరచిపోయి ఫోటోలకు ఫోజులిచ్చిన తెలుగమ్మాయి ప్రియ వడ్లమాని.. ఇలా చూస్తే తట్టుకోలేరు!

Also Read: Jr NTR’s prediction: నిజమైన ఎన్టీఆర్ అంచనా..విషెస్ చెప్పిన నటుడికి ఆస్కార్ అవార్డు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News