Adipurush Controversy: ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి డైలాగ్ మారిందిగా, ఎలా మారిందంటే

Adipurush Controversy: పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ చుట్టూ వివాదం ఇంకా సమసిపోలేదు. సినిమాలో సన్నివేశాలు, కాస్ట్యూమ్స్, డైలాగ్స్ ఇలా అన్నింటిపై తీవ్రస్థాయిలో విమర్శలు రేగడంతో చిత్ర యూనిట్ వెనక్కి తగ్గింది. డైలాగ్స్ మారుస్తామని ప్రకటించింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 21, 2023, 06:50 PM IST
Adipurush Controversy: ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి డైలాగ్ మారిందిగా, ఎలా మారిందంటే

Adipurush Controversy: ఓ వైపు ఆదిపురుష్ కలెక్షన్లతో దూసుకుపోతున్నా వివాదం మాత్రం ఆగడం లేదు. హనుమంతుడి డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, హిందూవుల మనోభావాల్ని గాయపరుస్తున్నాయనేది ప్రధానంగా విన్పిస్తున్న విమర్శ. అందుకే డైలాగ్స్ మార్చనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. 

ప్రభాస్ శ్రీ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో నటించగా సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషించారు. పాన్ ఇండియా సినిమాగా ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాకు డైలాగ్స్ రాసింది ప్రముఖ కవి మనోజ్ ముంతషిర్ శుక్లా. జూన్ 16న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల రికార్డులు కురిపిస్తుంటే..అదే స్థాయిలో వివాదం కూడా రేగుతోంది. ఈ సినిమాలో హనుమంతుడితో మాస్ డైలాగ్స్ చెప్పించడంపై భారీగా విమర్శలు చెలరేగాయి. పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో చిత్ర యూనిట్ వివరణ ఇచ్చుకుంది. డైలాగ్ మారుస్తామని ప్రకటించింది. ఓ దశలో రచయిత మనోజ్ శుక్లాకు బెదిరింపులు కూడా వచ్చాయి. దాంతో ఆయన ప్రాణహాని ఉందంటూ ముంబై పోలీసుల్ని సైతం ఆశ్రయించారు. 

హామీ ఇచ్చినట్టే చిత్ర దర్శకుడు, రచయిత హనుమంతుడితో పలికించి ఆ అభ్యంతరకర డైలాగ్ పదాన్ని మార్చారు. ఇప్పుడు కొత్త డైలాగ్ విన్పిస్తుంది సినిమాలో. పాత డైలాగ్‌లో అభ్యంతరకరంగా ఉందని భావించింది ఒక్క పదమే. హనుమంతుడితే బాప్ అనే పదాన్ని మాస్ డైలాగ్‌గా పలికిస్తారు. ఇదే అభ్యంతరానికి కారణంగా మారింది.  హనుమంతుడితో మాస్ డైలాగ్స్ పలికించడమేంటనే విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో చిత్ర యూనిట్ డైలాగ్ మార్పు చేసింది.

బాప్ పదం స్థానంలో లంక అనే పదాన్ని తగిలించారు. అంటే ఇప్పుడు పాత డైలాగ్ అలాగే ఉంటుంది కానీ బాప్ స్థానంలో లంక అనే పదం విన్పిస్తుంది. ఒక్క పదం మార్చినంత మాత్రాన మాస్ డైలాగ్ అర్ధం మారిపోతుందా అంటూ విమర్శిస్తున్నారు. కేవలం కంటి తుడుపు కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. 

ఆదిపురుష్ సినిమాలో ల్యాగ్ ఎక్కువగా ఉండటంతో క్రేజ్ తగ్గుతోంది. రోజురోజుకూ కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. మొదటి మూడ్రోజుల్లోనే 300 కోట్లు వసూలు చేసిన ఆదిపురుష్ సినిమా ఐదురోజులకు మరో 50 కోట్లు అదనంగా చేర్చగలిగింది. అంటే 5 రోజుల్లో  ఈ సినిమా కలెక్షన్లు 350 కోట్లుగా ఉంది. 

Also read: Anchor Rashmi Gautam: అదిరిపోయే అవుట్‌ఫిట్‌లో రష్మీ గౌతమ్ ఫొటోషూట్.. హాట్ యాంకర్ లేటెస్ట్ పిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News