Adipurush: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్‌గా తానాజీ దర్శకుడు ఓమ్రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈనెల 16వ తేదీన విడుదల ఎందుకు సిద్ధమవుతోంది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.
రామాయణ మహా గాధను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. మొదట్లో టీజర్ రిలీజ్ చేసినప్పుడు కొంత నెగిటివిటీ నడిచిన తర్వాత రిలీజ్ చేసిన రెండు ట్రైలర్లు సినిమాకి మంచి పాజిటివ్ బస్సు ఏర్పడేలా చేశాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్లేందుకు ఈ సినిమా ప్రదర్శిస్తున్న ప్రతి షోలో ఒక సీటు హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచుతామని.. సినిమా యూనిట్ ప్రకటించింది.
Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి
ఇక కార్తికేయ టు కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలతో ఫ్యాన్ ఇండియా లెవెల్లో సినిమాలు నిర్మిస్తున్న అభిషేక అగర్వాల్ హాట్ సంస్థ ఇప్పటికే అనాధలు స్కూల్ పిల్లల కోసం పదివేల ఆదిపురుష్ సినిమా టికెట్లను ఇస్తామని ప్రకటించి.. ఆ మేరకు ప్లాన్లు కూడా సిద్ధం చేసింది. ఇప్పుడు ఆసక్తికరంగా మరికొన్ని వార్తలు తెరమీదకి వస్తున్నాయి. బాలీవుడ్ హీరో రన్ బీర్ కపూర్ తాను కూడా పదివేల టికెట్లను అనాధ పిల్లల కోసం స్పాన్సర్ చేయడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మాత్రమే కాదు టాలీవుడ్ యంగ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ సైతం పదివేల టికెట్లను స్పాన్సర్ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
మొత్తంగా చూసుకుంటే ఈ పదివేల టికెట్ల ట్రెండు కూడా పెద్ద ఎత్తున ఆదిపురి సినిమాకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఒక నిర్మాణ సంస్థ ఇద్దరు బడా హీరోలు 10,000 టికెట్లు చొప్పున కొనుగోలు చేయడానికి సిద్ధమవుగా భవిష్యత్తులో మరికొందరు యంగ్ హీరోలు నిర్మాణ సంస్థలు సైతం కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఆది పురుష సినిమా కొత్త రికార్డులు సెట్ చేయడానికి రంగం సిద్ధమైనట్లుగానే కనిపిస్తోంది.
Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook