Adhire Abhi : అందుకే జబర్దస్త్ షోలో ఎక్కువ ఇస్తారు.. చైతన్య మాస్టర్ చివరి వీడియోపై అదిరే అభి

Jabardasth Show Remuneration జబర్దస్త్, ఢీ షోల రెమ్యూనరేషన్‌ల గురించి తాజాగా అభి స్పందించాడు. జబర్దస్త్ షోలో సుధీర్ఘ కాలం చేసిన అభి ఇప్పుడు బుల్లితెరకు దూరంగా ఉన్నాడు. సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా జరుగుతున్న వివాదం మీద అభి స్పందించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2023, 11:38 AM IST
  • బుల్లితెరపై రెమ్యూనరేషన్ల గొడవ
  • స్పందించిన అదిరే అభి
  • చైతన్య మాస్టర్ మృతిపై వీడియో
Adhire Abhi : అందుకే జబర్దస్త్ షోలో ఎక్కువ ఇస్తారు.. చైతన్య మాస్టర్ చివరి వీడియోపై అదిరే అభి

Jabardasth Show Remuneration ఢీ కొరియోగ్రాఫర్‌ చైతన్య మాస్టర్ ఆత్మహత్య పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది. మల్లెమాల వారు సరైన పారితోషికం ఇవ్వక పోవడం వల్ల చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొందరు ఈవెంట్ ఆర్గనైజర్స్ దోపిడి కారణంగా కూడా చైతన్య మాస్టర్ వంటి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని అన్నారు.

డిసెంబర్ 31 రాత్రి ఈవెంట్‌ డబ్బు అందక పోవడం వల్లే చైతన్య మాస్టర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటున్నారు. ఈ సమయంలో ఈశ్వర్ సినిమాతో నటుడిగా గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి.. జబర్దస్త్‌ లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన అదిరే అభి ఈ విషయమై స్పందించాడు. చైతన్య మాస్టర్‌ ఆత్మహత్య నేపథ్యంలో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వారికి అభి పలు సలహాలు ఇచ్చాడు. 

ఇన్‌ స్టా గ్రామ్ లో అదిరే అభి ఒక వీడియోను షేర్‌ చేశాడు. అందులో అభి మాట్లాడుతూ... సినిమా ఇండస్ట్రీ లేదా టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని వచ్చే వారికి అంత సులభంగా ఎంట్రీ దక్కదు. రెడ్‌ కార్పెట్‌ వేసి ఏ ఒక్కరు కూడా వెల్ కమ్ చెప్పే పరిస్థితి లేదు. కడుపు మాడ్చుకుని.. కష్టాలు పడితేనే సక్సెస్ లు దక్కుతాయి.

ఒక సినిమా ఆఫర్ లేదా ఏదైనా ఆఫర్ వచ్చిన తర్వాత ఇక కెరీర్ లో ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్లవచ్చు అనుకోవడానికి కూడా లేదు. ఒకటి రెండు సినిమాల్లో నటించిన తర్వాత లేదా షో స్‌ చేసిన తర్వాత కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 1990 చివర్లో అమితాబచ్చన్‌ నిర్మాతగా వంద కోట్లకు పైగా నష్టాలను చవి చూశారు. ఆయన మళ్లీ కౌన్ బనేగా కరోడ్‌ పతి షో ద్వారా డబ్బులు సంపాదించారు. కెరీర్‌ లో ఏ సమయంలో అయినా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా అభి చెప్పుకొచ్చాడు. 

 

కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వారు ముందే ప్లాన్‌ బి ని చూసుకోవాలి. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత ఏమైనా సమస్యలు వస్తే పరిస్థితి ఏంటి అనే విషయాన్ని ప్లాన్‌ చేసుకోవాలి. అలాగే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదటి నుండే సేవింగ్స్‌ చేసుకుంటూ ఉండాలి. ఎంత వస్తే అంత ఖర్చు పెట్టకుండా వచ్చే ప్రతి పైసా లో కూడా సేవింగ్‌ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే కష్టం వచ్చినప్పుడు సేవింగ్ చేసుకున్న మొత్తం ఉపయోగపడుతుందని అభి పేర్కొన్నాడు. 

Also Read:  samyuktha hegde : బికినీలో తాటిచెట్టెక్కిన సంయుక్త..పిచ్చెక్కించిన 'కిరాక్' బ్యూటీ

ఇక మల్లెమాల వారి శ్రమ దోపిడి వార్తలపై స్పందించిన అభి తాను ఆ ఆరోపనను సమర్థించను అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. నెలలో పది రోజులు మల్లెమాల కోసం వర్క్‌ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 రోజులు మీరు ఈవెంట్స్ చేసుకోండి.. లేదంటే మరేదైనా చేసుకోండి అన్నట్లుగా వారు ఇవ్వాల్సిన మొత్తం ఇస్తారు. జబర్దస్త్‌ వారికి షో రేటింగ్‌ ఎక్కువగా ఉంటుంది కనుక ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు.

షో కి వచ్చే రేటింగ్‌ ను బట్టి పారితోషికం ఉంటుంది. అంతే తప్ప ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది అస్సలు ఉండదు. మల్లెమాల వారు మాత్రమే కాదు ఏ ఒక్కరు కూడా అలా తక్కువ ఇవ్వరు అన్నట్లుగా అభి పేర్కొన్నాడు. కొత్తగా వచ్చే వారు ప్లాన్‌ బి తో రావడంతో పాటు.. వచ్చే ప్రతి రూపాయిలో కొంత మొత్తంను సేవ్‌ చేసుకోవాలి అంటూ అభి సూచించాడు.

Also Read:  Prabhas Hospitality : నిజంగానే రాజువయ్యా!.. ప్రభాస్ గొప్పదనం చెప్పిన రంగస్థలం మహేష్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News