Actress Tulasi Video: నా మీద మీకు ఇంత ప్రేమ ఏంటండీ,, నాకు ఇంకేం అక్కర్లేదంటూ వీడియో రిలీజ్!

Actress Tulasi Emotional : ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన తులసిని అభిమానులు విపరీతంగా ఆదరిస్తున్నారు, దీంతో ఆమెకు అతి తక్కువ సమయంలోనే 50 వేల మంది ఫాలోవార్లు వచ్చారు. దీంతో ఆమె ఎమోషనల్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది.   

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 26, 2023, 05:57 PM IST
Actress Tulasi Video: నా మీద మీకు ఇంత ప్రేమ ఏంటండీ,, నాకు ఇంకేం అక్కర్లేదంటూ వీడియో రిలీజ్!

 Actress Tulasi Emotional Video: తెలుగు వారందరికీ నటి తులసి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె చిన్ననాటి నుంచి బాల నటిగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోయిన్ గా కూడా అనేక సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టి ఇప్పటికీ అనేక సినిమాల్లో తల్లి, అత్త పాత్రలలో నటిస్తూ తెలుగు వారందరికీ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఇలానే ఉంటుందా అనేటుగా నటిస్తున్నారు.

ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఆమె సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడంతో ఆమె మీద అభిమానులు తమ ప్రేమ మొత్తాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఫేస్బుక్ పేజీలో పాటు ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసుకోగా ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ కి ఇప్పుడు 50,000 మంది ఫాలోవర్లు వచ్చారు. దీంతో తులసి తన ఆనందాన్నివ్యక్తం చేస్తూ విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by P A Thulasi (@tulasiactress)

నా మీద మీకు ఇంత ప్రేమ ఏంటండీ బాబోయ్, నేను రుణపడి ఉన్నానండి మీ అందరికీ, మీ ప్రేమ వల్లే నేను ఇలా ఉన్నాను, చాలండీ నాకు ఇంకేం అక్కర్లేదు, ఇది ఎంతో ఎంతో గొప్ప విషయం ఇదే నా ఆస్తి, ఇంకా చాలు నా మీద మీరు కురిపిస్తున్న ప్రేమ ఇక చాలు అంటూ ఆమె ఎమోషనల్ అవుతూ వీడియో చేసింది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, భోజ్పురి, భాషలలో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన ఆమెకు రెండు నంది అవార్డులు ఒక ఫిలింఫేర్ అవార్డు కూడా లభించాయి. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన శివమణి అనే ఒక డైరెక్టర్ ను వివాహం చేసుకున్న తులసి తర్వాత సాయి తరుణ్ అనే బాలుడికి జన్మనిచ్చింది.

నిజానికి హీరోయిన్గా నటిస్తున్న రోజుల్లోనే ఆమె వివాహం చేసుకొని సినీ పరిశ్రమకు దూరం అయిపోయింది. తర్వాత ఇక సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని అనుకుంది కానీ ఆమె కుమారుడికి ఆరేళ్ల సమయంలో కన్నడ నటి దివ్య స్పందనకు తల్లి పాత్రలో నటించమని ఆమెకు ఆఫర్ వచ్చింది. ముందు తట పటాయించినా తర్వాత ఆమె నటించడంతో ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు,ఆమెకు అలాంటి ఎన్నో అవకాశాలు రావడంతో ఆమె వెనక్కి తగ్గకుండా చేసుకుంటూ వెళ్లారు. ఇక తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో మీరు కూడా చూసేయండి మరి.

Also Read: ​Pak Actress Dance for Naatu Naatu: నాటు నాటు సాంగ్ కు పాక్ నటి స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా!

Also Read: Vithika Sheru Photos: పెళ్లయ్యాక మొదటిసారిగా రెచ్చిపోయిన వితికా షేరు.. హాట్ ఫోటోలు చూశారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

 

Trending News