Actress Ramya : మొన్న సమంత, రష్మిక.. ఇప్పుడు దీపిక.. అందుకే వారిని టార్గెట్ చేశారంటున్న హీరోయిన్!

EX Mp Ramya Supports Deepika Padukone: దీపికా పదుకొనె బికినీ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే, ఆ విషయం మీద నటి, రాజాకీయ నేత రమ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 17, 2022, 05:47 PM IST
Actress Ramya : మొన్న సమంత, రష్మిక.. ఇప్పుడు దీపిక.. అందుకే వారిని టార్గెట్ చేశారంటున్న హీరోయిన్!

EX Mp Ramya Supports Deepika Padukone: ప్రస్తుతానికి దీపికా పదుకొనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే ఇటీవల రణవీర్ సింగ్ ను వివాహం చేసుకుని తర్వాత కూడా ఆమె హీరోయిన్గా కొనసాగుతూ అనేక బోల్డ్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా ఆమె షారుఖ్ ఖాన్ సరసన పఠాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఆ సినిమా నుంచి బేషరం రాంగ్ అనే ఒక సినిమా పాట రిలీజ్ అయి అది హాట్ టాపిక్ గా మారింది.

ఆ సాంగ్ లో డాన్స్ వేస్తున్న సమయంలో దీపిక పడుకునే కాషాయ రంగు బికినీ ధరించారని, కుంకుమపువ్వు రంగు గల బికినీ కూడా ధరించారని అలా ధరించిన ఒక హిందూ మహిళను ఒక ముస్లిం వ్యక్తి ఎలా టచ్ చేస్తాడు? కావాలనే ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీయాలని ఇలా చేస్తున్నారు అంటూ ఒక వర్గం వారు పెద్ద ఎత్తున విమర్శలు వర్షం కురిపిస్తున్న నేపద్యంలో దీపికకు మద్దతుగా కూడా అనేకమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రంగులో ఏముంది అది కేవలం సినిమానే కదా అంటూ వారంతా మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఇదే విషయం మీద కన్నడ నటి, లోకసభ మాజీ ఎంపీ రమ్య స్పందన స్పందించారు. కేవలం స్త్రీ ద్వేషంతోనే పలువురు దీపికా పదుకొనేను ట్రోల్ చేస్తున్నారని ఆమె అన్నారు. స్త్రీ వ్యతిరేకతపై ఇప్పటికైనా ఎదురు తిరగాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. అంతేకాక సమంత, రష్మిక, సాయి పల్లవి పేర్లను ప్రస్తావిస్తూ ఆమె ఈ విషయాన్ని పేర్కొనడం గమనార్హం.

విడాకులు తీసుకుందనే కారణంతో సమంతను అప్పట్లో ట్రోల్ చేశారు, అలాగే కాశ్మీర్ ఫైల్స్ కి సంబంధించిన తన అభిప్రాయాన్ని బయట పెట్టిందని సాయి పల్లవిని ట్రోల్ చేశారు, ఒక నటుడితో బ్రేకప్ చెప్పుకున్నందుకు రష్మికని ఇప్పుడు తక్కువగా బట్టలు వేసుకుందని దీపికని టార్గెట్ చేస్తున్నారు. ఇలా చెబుతూ వెళితే ఎంతోమంది మహిళలు ఇలాంటి చిన్న చిన్న కారణాలకు విమర్శలు ఎదుర్కొంటున్నారు.

దుర్గాదేవి ప్రతిరూపాలే మహిళలు అని నమ్మే మన దేశంలో స్త్రీ ద్వేషం అనే ఒక రాక్షసుడితో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అంటూ రమ్య తన ట్వీట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రమ్య కన్నడ సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్గా పరిచయమయ్యారు. ఆమె తెలుగు, తమిళంలో కూడా పలు సినిమాలు చేశారు. తెలుగులో అభిమన్యుడు అనే పేరుతో తెరకెక్కిన సినిమా ద్వారా ఆమె తెలుగులో కూడ హీరోయిన్గా పరిచయమయ్యారు. ఇక కళ్యాణ్ రామ్ సరసన ఆమె ఈ సినిమాలో నటించింది కానీ ఈ సినిమా మీకు పెద్దగా పేరైతే తీసుకురాలేకపోయింది. 

Also Read: Accident : బాలకృష్ణ సినిమా యూనిట్ కు యాక్సిడెంట్… నలుగురు ఆర్టిస్టులకు తీవ్ర గాయాలు?

Also Read: Kushboo Sundar : ఖుష్బూ సుందర్ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ అవుతూ పోస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 
 

Trending News