ఫార్మూలా వన్ రేసులో దుమ్ముదులుపుతున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

Guess Who is She: ఈ ఫోటోలోని సర్కిల్ లో ఉన్న ముద్దులొలికే చిన్నారిని గుర్తుపట్టారా? ఈమె తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ ఫేమస్ హీరోయిన్.. అటు తమిళం ఇటు తెలుగుతో పాటు అనేక భాషల చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా?   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2022, 02:04 PM IST
ఫార్మూలా వన్ రేసులో దుమ్ముదులుపుతున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

Nivetha Pethuraj Unseen Childhood Photos: ఈ ఫొటోలోని సర్కిల్ లో ఉన్న చిన్నారికి ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. అందులోను హీరోయిన్ లకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమకు నచ్చిన హీరోయిన్ల కోసం గుడులు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి తమ అభిమాన నటీనటులు సినిమా అప్ డేట్స్ కానీ చిన్ననాటి ఫోటోలు కానీ షేర్ చేస్తే వాటిని క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు అభిమానులు. తెలుగులో ఇప్పుడు మంచి ఫార్మ్ లో ఉన్న రష్మిక, పూజా హెగ్డే, కీర్తీ సురేష్ ఇలా చాల మంది చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియా లో ఈ మధ్యకాలంలో దర్శనం ఇచ్చాయి.

ఇప్పుడు ఇదే తరహాలో ఒక యంగ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ హీరోయిన్ తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈమె యంగ్ హీరోలకు జోడిగా నటించింది. తమిళంలో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది.

ఈ హీరోయిన్ సినిమాలతో పాటు ఫార్ములా వన్ రేసింగ్ లో కూడా తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే ఈ ఫొటోలో ఉన్న చిన్నారి పేరు నివేథా పేతురాజ్. 'మెంటల్ మదిలో..' అనే చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కు హీరోయిన్ గా పరిచయమయ్యింది. 

'చిత్రలహరి' చిత్రంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. అలాగే తెలుగులో 'బ్రోచేవారెవరురా', 'అల వైకుంఠపురములో..', 'రెడ్', 'పాగల్' వంటి చిత్రాలతో ప్రేక్షకులకు నటనతో మరింతగా ఆకట్టుకుంది. ప్రస్తుతం నివేద పేతురాజ్ 'విరాటపర్వం' చిత్రంతో పాటు చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తుంది. 

Also Read: Samantha: ఛాలెంజింగ్ నెగెటివ్ పాత్రలో కన్పించనున్న సమంత

Also Read:  Esha Gupta Photos: అర్థనగ్నంగా రామ్ చరణ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News