Nayanthara Casting Couch: 'నయనతార'నూ వదలలేదు.. క్యాస్టింగ్ కౌచ్ అనుభవం బయటపెట్టేసింది!

Nayanthara Casting Couch Experience: సినీ హీరోయిన్ నయనతార కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 2, 2023, 01:59 PM IST
Nayanthara Casting Couch: 'నయనతార'నూ వదలలేదు.. క్యాస్టింగ్ కౌచ్ అనుభవం బయటపెట్టేసింది!

Actress Nayanthara Casting Couch Experience: సినీ హీరోయిన్ నయనతార గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్గా మారిన ఆమె ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో టాప్ హీరోయిన్ గా కూడా ఎదిగింది. ఇప్పుడు జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని ఆమె ప్రయత్నాలు చేస్తోంది. ఈ మధ్యనే తాను చాలా కాలం నుంచి ప్రేమిస్తున్న విగ్నేష్ శివన్ అనే దర్శకుడిని వివాహం చేసుకున్న ఆమె ఆయన ద్వారా ఇద్దరు కవలలకు కూడా జన్మనిచ్చింది.

ఇక తాజాగా తన కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఆమె బయటపెట్టినట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం ఒక పెద్ద సినిమాలో తనకు ఆఫర్ ఇస్తానని చెప్పి దానికి బదులుగా ఫేవర్ అడిగారని వెల్లడించింది. అయితే ఆ ఆఫర్ రిజెక్ట్ చేయడానికి తనకు ధైర్యం ఉందని అందుకే అప్పటికప్పుడు ఆఫర్ రిజెక్ట్ చేశానని నయనతార చెప్పుకొచ్చింది.

అలాగే ఆమె తన నటనా సామర్థ్యం మీద తనకు నమ్మకం ఉందని కూడా ఆమె కామెంట్ చేసింది. సినిమాలో ఒక కీలక పాత్ర ఇస్తామని చెబుతూ ఫేవర్ అడిగారని అయితే తాను వెంటనే అలాంటివి తన నుంచి ఆశించవద్దని ముఖం మీదే చెప్పానని ఆమె చెప్పుకొచ్చింది. నయనతార ప్రస్తుతానికి షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో నయనతార షారుక్ ఖాన్లతో కలిసి విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే, ప్రియమణి, సోనియా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఒక రకంగా తన ఖాతాలో అనేక సూపర్ హిట్ సినిమాలతో నయనతార ఇప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. చివరిగా ఆమె కనెక్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని నయనతార భర్త నిర్మించడం ఇక ఇప్పటికే జవాన్ సినిమా షూటింగ్ పూర్తి కాగా ఆమె తన 75వ సినిమా షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది. అలాగే ఆమె నటించిన ఒక తమిళ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది.

Also Read: Dil Raju Bought Dasara: టీజర్ దెబ్బకు దసరాను కొనేసిన దిల్ రాజు.. ఏకంగా నాలుగు కోట్లు ఎక్కువ పెట్టి!

Also Read: Chiranjeevi Help: మరోసారి చిరు మంచి మనసు.. తిండికి ఇబ్బందిపడుతున్న కెమెరామెన్ కు ఆర్ధిక సాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 
 

Trending News